News February 18, 2025

సంగారెడ్డి: కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు: కలెక్టర్

image

ప్రతి విద్యార్థికి పదవ తరగతి కీలకమని.. కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. బీహెచ్ఈఎల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షలు దగ్గర పడుతున్నందున అన్ని పాఠ్యాంశాలను పూర్తిగా చదవాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.

Similar News

News November 7, 2025

బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్

image

బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పేరెంట్స్ అయ్యారు. కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. నవంబర్ 7న మగబిడ్డ జన్మించాడని విక్కీ కౌశల్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరికి 2021లో వివాహమైంది.

News November 7, 2025

భారత భూమికి ఉన్న గొప్పతనం ఇదే!

image

గత 8 ఏళ్లలో 14 దేశాలు తిరిగిన తర్వాత ఇండియాకు ఉన్న గొప్పతనాన్ని గుర్తించానని ఓ ట్రావెలర్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. అమెరికా & యూరప్‌లలో ఎక్కువగా చలి, మధ్యప్రాచ్యంలో దారుణమైన వేడి, ఆగ్నేయాసియాలో అధిక తేమ ఉంటుందని పేర్కొన్నారు. అదే ఇండియాలో వెదర్ హ్యూమన్ ఫ్రెండ్లీగా ఉందని గుర్తించినట్లు తెలిపారు. ప్రకృతి ఇంతగా అనుకూలించినప్పటికీ అవినీతి, దూరదృష్టి లోపం కారణంగానే భారత్ వెనకబడిందని అభిప్రాయపడ్డారు.

News November 7, 2025

ములుగు: పాఠశాల నిర్మాణం ఆపారు.. మరి చర్యలేవి!

image

ఏటూరునాగారం మండలం కొమురంభీం గుత్తికోయగూడెంలో అటవీశాఖ అధికారులు పాఠశాల నిర్మాణ పనులను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే పాఠశాల నిర్మాణ పనులు చేపట్టిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు బీట్ అధికారి, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకపోవడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. గుత్తికోయల అభివృద్ధి కోసం కడుతున్న పాఠశాల అడ్డుకొని అటవీశాఖ అబాసుపాలవుతుంది.