News February 18, 2025
జిల్లాలో హోటల్స్‌కు ప్రభుత్వం రేటింగ్: కలెక్టర్

పర్యావరణ హితంగా, పర్యాటకులను ఆకర్షించేలా నడిపే హోటళ్లకు ప్రభుత్వం గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇస్తుందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో హోటల్ యజమానులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చే ఈ రేటింగ్‌ను హోటల్స్ ఆన్‌లైన్ లో అప్లోడ్ చేసుకోవచ్చునని, అందువలన ఆయా హోటల్స్‌కు ర్యాంకింగ్ బుక్ చేసుకునే వారికీ తెలుస్తుందని పేర్కొన్నారు.
Similar News
News February 24, 2026
భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో తారకరామ తీర్థసాగర్, తోటపల్లి, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, తదితర పనుల పురోగతిని సమీక్షించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రహదారి, కాలువలు, ఎస్టీపీలు, ఒబేరాయ్ హోటల్‌కు సంబంధించిన భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలన్నారు.
News February 24, 2026
చీపురుపల్లిలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే

సీఎం చంద్రబాబు ఈనెల 28న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం 28న ఉదయం 11 గంటలకు చీపురుపల్లి మండలం రావివలసకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. 11.20 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావేదిక మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం 1.40 నుంచి 2.25 వరకూ పైలపేటలోని లబ్ధిదారులను కలుస్తారు. 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రావివలసలో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం తిరుగుపయనమౌతారు.
News February 24, 2026
VZM: ఈరోజు పరీక్షకు 515 మంది గైర్హాజరు

విజయనగరం జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షను 19,483 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 18,968 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్‌స్పెక్టర్ తవిటినాయుడు తెలిపారు. మొత్తం 515 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 100 మంది ఇన్విజిలేటర్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు నియమించారు. జిల్లాలో ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని చెప్పారు.


