News February 18, 2025
సిరిసిల్ల: అడ్డుకట్ట వేస్తూ చర్యలు తీసుకోండి: ఎస్పీ

అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేస్తూ చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో వేములవాడ సబ్ డివిజన్ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమంగా ఇసుక తవ్వకాలు రవాణా చేపట్టే వారిపై చట్టపరమైన ఓ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇసుకను అక్రమంగా రవాణాకు పాల్పడే వారిపై సున్నితంగా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు.
Similar News
News March 14, 2025
MBNR: రెండు బైకులు ఢీ.. యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన గురువారం సీసీ కుంట మండల పరిధిలో చోటు చేసుకుంది. SI రామ్‌లాల్ నాయక్ వివరాలు.. పార్దిపూర్ గ్రామానికి చెందిన రాజు (31) నిన్న సాయంత్రం బైక్‌పై లాల్ కోట వైపు వెళ్తున్నాడు. పర్దిపూర్ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న రమేష్ నాయక్ బైక్ ఎదురుగా వచ్చి బలంగా ఢీ కొనగా రాజు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్‌కు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
News March 14, 2025
PDTR: ఆసుపత్రిలో దొంగతనానికి విఫలయత్నం

ఆసుపత్రిలోనే డాక్టర్ చైన్ కొట్టేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ శ్రీవాణి గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆపరేషన్ రూము వైపు వెళ్తుండగా.. మెట్ల వద్ద ఓ వ్యక్తి ఆమె మెడలోని చైన్ లాగడానికి ట్రై చేశాడు. అతడిని వెనక్కి నెట్టేయగా.. మరోసారి చైన్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. డాక్టర్ కేకలు వేయడంతో పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
News March 14, 2025
వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోదీ

AP: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధాని పున:ప్రారంభ పనులకు ఏప్రిల్ 15న ఆయన హాజరుకానున్నారు. రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి మూడేళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.