News February 18, 2025
భవన నిర్మాణ నిబంధనలు పాటిస్తేనే అనుమతులు: బల్దియా కమిషనర్

భవన నిర్మాణ నిబంధనలు పాటిస్తేనే అనుమతులు జారీ చేస్తామని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే స్పష్టం చేశారు. నూతన భవనాల నిర్మాణాలకు అనుమతుల మంజూరు బడా భవన నిర్మాణాలకు ఆక్యుపేన్సి సర్టిఫికెట్ల జారీకై సోమవారం కమిషనర్ నగర పరిధిలోని పోస్టల్ కాలనీ, లోటస్ కాలనీ ఖాజీపేట ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నమోదు చేసిన వివరాలను కొలతలు వేసి పరిశీలించారు.
Similar News
News March 14, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.5,11,031 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,85,465, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.2,80,500, అన్నదానానికి రూ.45,066 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
News March 14, 2025
సాగు, తాగునీటికి ఇబ్బందులు రావొద్దు: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో సాగు, తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం పాలేరు జలాశయాన్ని సందర్శించి, జలాశయం నీటిమట్టం వివరాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంటల పరిస్థితిపై వ్యవసాయ శాఖ అధికారులను ఆరా తీశారు.
News March 14, 2025
MNCL: సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకోవాలి: సీపీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా, మహిళల పట్ల మర్యాదగా ఉంటూ సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకోవాలని సీపీ అంబర్ కిశోర్ ఝా పిలుపునిచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, హోలీ తర్వాత యువత స్నానాల కోసం చెరువులు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. అనుమతి లేకుండా రంగులు చల్లడం, బైకులు, కార్లల్లో గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు.