News February 18, 2025

ఎల్లారెడ్డిపేట: బస్సు టైర్ పంచర్.. తప్పిన ప్రమాదం

image

ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రామ శివారులోని బస్సు టైర్ పంచర్ కావడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అన్నారు. వీర్నపల్లి మండలం వన్‌పల్లి నుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు 110మంది ప్రయాణికులతో వెళుతుండగా బస్సు ఒక్క సైడు ఒరిగి ఆగిపోయింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సిరిసిల్ల నుంచి వన్ పల్లికి మరికొన్ని బస్సులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Similar News

News April 17, 2026

HYD‌లో నయా ట్రెండ్ ఇదే!

image

HYDలో నైట్‌లైఫ్ ఇప్పుడు పక్కా క్యాలెండర్ ఈవెంట్‌లా మారిపోయింది. ఐటీ కుర్రాళ్లు, స్టూడెంట్స్ వారం ముందే గెస్ట్ లిస్టులు, టేబుల్స్ బుక్ చేసుకుంటున్నారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలిలో క్లబ్బింగ్ అంటే ఒక మినీ ఫెస్టివల్‌ను తలపిస్తోంది. సమయం తక్కువగా ఉండటంతో, రాత్రిపూట తిరగడం కంటే ముందే అన్నీ ప్లాన్ చేసుకోవడానికే యువత ప్రాధాన్యం ఇస్తోంది. పక్కా షెడ్యూల్‌తో ఎంజాయ్ చేయడం ఇప్పుడు ట్రెండ్.

News April 17, 2026

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు: కలెక్టర్

image

ఈనెల 25న జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు (పాలిసెట్) పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 15 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏలూరులో 9, నూజివీడులో 3, జంగారెడ్డిగూడెంలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News April 17, 2026

పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పెద్దపులి సంచారం

image

పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో ఆరు రోజులుగా సంచరిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. రేడియో కాలర్ సిగ్నల్స్ ఆధారంగా పులి కదలికలను గుర్తిస్తూ, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ డ్రోన్లు, ట్రాంక్విలైజర్ గన్‌లతో గాలింపు చేపడుతోంది. పులికి హాని కలగకుండా త్వరలోనే బంధిస్తామని, అప్పటివరకు స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారి ఎస్.కె. వలీ సూచించారు.