News February 18, 2025

ఎల్లారెడ్డిపేట: విషాదం.. వ్యక్తి ఆత్మహత్య

image

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రమాకాంత్ తెలిపిన వివరాలు.. హనుమ కనకయ్య(40) అప్పుల బాధతో మద్యానికి బానిస అయ్యాడు. సోమవారం ఉదయం అతడి బెడ్రూమ్‌లో ఉరేసుకుని చనిపోయినట్లు అతడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News April 15, 2026

ఉపాధి పనుల జోరు.. అగ్రస్థానంలో జగ్గసాగర్‌..!

image

జిల్లాలో ఉపాధి హామీ పనులు జోరందుకున్నాయి. బుధవారం మెట్‌పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో 276 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు అత్యధికంగా హాజరై జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో 256మంది కూలీలు హాజరై జిల్లాలో ద్వితీయ స్థానం దక్కించుకుంది. గొల్లపల్లి మండలం చిల్వకోడూరులో 243 మంది కూలీలు హాజరై జిల్లాలో తృతీయ స్థానంలో నిలిచిందని ఉపాధి హామీ అధికారులు ప్రకటించారు.

News April 15, 2026

NZB: పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన వర్సిటీ ఉపకులపతి

image

తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్సుల 8వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి. యాదగిరి రావు పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ టి. సంపత్‌తో కలిసి కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు, ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.

News April 15, 2026

నేడు నిజామాబాద్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ రాక

image

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం మంత్రి నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2:45 గంటలకు నిజామాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బేగంపేటకు తిరుగు పయనవుతారు.