News February 18, 2025
రాజంపేట్: చికిత్స పొందుతూ యువకుడి మృతి

రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన కోదండం సాయికుమార్ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు. మృతుడు రెండు రోజుల క్రితం పురుగు మందు తాగడంతో కామారెడ్డిలోని ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు. అతను తూప్రాన్‌లో ఐటీఐ చదువుతున్నట్లు చెప్పారు.
Similar News
News April 19, 2026
మచిలీపట్నంలో నేడు బంగారం ధర ఎంతంటే!

అక్షయ తృతీయ కావడంతో జిల్లా కేంద్రంమైన మచిలీపట్నంలోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. మచిలీపట్నంలో ఆదివారం గ్రాము బంగారం రూ. 15,078 పలుకుతోంది. 10 గ్రాములు రూ. 1,50,780 చొప్పున విక్రయిస్తున్నారు. వెండి గ్రాము రూ.280గా ఉంది. అక్షయ తృతీయలో కనీసం గ్రాము బంగారమైనా కొనాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు.
News April 19, 2026
భద్రాద్రి: యువత భవిష్యత్తుకు.. పంచాయతీ సంచలన నిర్ణయం

నాటు సారాయి తయారీ, విక్రయాలపై ఇల్లందు(M) ధనియాలపాడు GP ఉక్కుపాదం మోపింది. సర్పంచ్ సనప సావిత్రి వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక తీర్మానం చేశారు. ఎవరైనా సారాయి కాస్తూ పట్టుబడితే పోలీసు కేసులు, పీడీ యాక్ట్ నమోదు చేయడమే కాకుండా.. వారికి అందే రేషన్, పెన్షన్ వంటి ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు.
News April 19, 2026
విజయనగరంలో నేడు బంగారం ధర ఎంతంటే..?

అక్షయ తృతీయ కావడంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. ఆదివారం గ్రాము బంగారం రూ.14,280 పలుకుతోంది. సవర(8గ్రాములు) రూ. 1,14,240 చొప్పున విక్రయిస్తున్నారు. ప్లాటినం గ్రాము 7,641 గా ఉంది. ఇక వెండి గ్రాము రూ.266 గా ఉంది. అక్షయ తృతీయలో కనీసం గ్రాము బంగారమైనా కొనాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు.


