News February 18, 2025
ఢిల్లీ తొక్కిసలాటలో కుట్ర కోణం లేదు: రైల్వే మంత్రి

ఢిల్లీ తొక్కిసలాట ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తేల్చిచెప్పారు. ‘తొక్కిసలాట జరిగేంత రద్దీ కూడా రైల్వే స్టేషన్లో లేదు. కుట్రేమీ లేదని భావిస్తున్నాం. ప్రస్తుతం సీసీటీవీ పర్యవేక్షణ మరింతగా పెంచాం’ అని పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ స్టేషన్‌కు ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 8 కంపెనీల పారామిలిటరీ బలగాల్ని స్టేషన్‌కు లోపల, బయటా మోహరించినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News March 12, 2025
ఒకే ఫ్రేమ్‌లో నాని, విజయ్ దేవరకొండ, మాళవిక

నాని, విజయ్ దేవరకొండ, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా ఈనెల 21న రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నటీనటులు 10 ఏళ్ల తర్వాత ఒక్కచోటకు చేరారు. సినిమాలో ఉన్నట్లు ఒకే బైక్‌పై ముగ్గురు కూర్చొని కెమెరాలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. ఇండస్ట్రీలో ఇన్నేళ్లలో ఎన్నో మార్పులొచ్చినా వీరి బాండింగ్ మారలేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News March 12, 2025
ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం: రేవంత్

TG: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర తమదేనని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కొలువుల పండగలో 1,532 మందికి సీఎం నియామక పత్రాలు అందజేశారు. ‘కేసీఆర్ ఫ్యామిలీకి ఉద్యోగాలు పోవడం వల్లే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయి. గత పన్నెండేళ్లలో ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు’ అని ఆయన పేర్కొన్నారు.
News March 12, 2025
గవర్నర్‌కు KTR క్షమాపణలు చెప్పాలి: మహేశ్ కుమార్

TG: గవర్నర్ ప్రసంగాన్ని అవమానపరిచేలా KTR <<15732904>>మాట్లాడారని <<>>పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అధికారం పోయినా, ఆయనలో అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. KTR గవర్నర్‌కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు ప్రతిపక్ష నేతగా KCR అసెంబ్లీకి రావడాన్ని మహేశ్ కుమార్ స్వాగతించారు. ప్రభుత్వానికి KCR సలహాలు ఇవ్వాలని సూచించారు.