News March 21, 2024

శుభ ముహూర్తం

image

తేదీ: మార్చి 21, గురువారం,
ఫాల్గుణము
శుద్ధ ద్వాదశి: ఉదయం 04:44 గంటలకు
అశ్లేష: తెల్లవారుజామున 01:27 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 10:14-11:02 గంటల వరకు,
మధ్యాహ్నం 03:02-03:50 గంటల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 12:56-02:23 గంటల వరకు

Similar News

News October 1, 2024

డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు 15వ సారి పెరోల్

image

అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభ‌విస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ పెరోల్‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం అనుమ‌తించింది. అక్టోబ‌ర్ 5న జ‌ర‌గ‌నున్న‌ హ‌రియాణా ఎన్నిక‌ల ముందు ఆయ‌న‌కు పెరోల్ రావ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసింది. ఇప్ప‌టికే ఈ కేసులో ఆయ‌న గత 9 నెల‌ల్లో మూడుసార్లు, గ‌త నాలుగేళ్ల‌లో 15 సార్లు పెరోల్‌పై విడుద‌లవ్వ‌డం గ‌మ‌నార్హం. అత‌ని పెరోల్ ర‌ద్దు చేయాల‌ని ఈసీని కాంగ్రెస్ కోరింది.

News October 1, 2024

శృంగారం తర్వాత రక్తస్రావం.. గూగుల్లో రెమిడీస్ వెతికిన బాయ్‌ఫ్రెండ్

image

కామన్‌సెన్స్ లేకుండా ఆన్‌లైన్ రెమిడీస్ వెతకడం ఎంత డేంజరో చెప్పడానికి ఇదే ఉదాహరణ. గుజరాత్‌లో 23Yrs నర్సింగ్ గ్రాడ్యుయేట్, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ SEP23న హోటల్‌కెళ్లి శృంగారంలో పాల్గొన్నారు. అప్పుడామెకు విపరీతంగా రక్తస్రావమైంది. ఓ వైపు ఆమె భయపడుతోంటే అతడేమో గూగుల్లో రెమిడీస్ వెతికాడు. విలువైన సమయం వృథా కావడంతో ఆమె స్పృహ తప్పింది. ఆస్పత్రికి తీసుకెళ్తే చనిపోయిందని డాక్టర్లు డిక్లేర్ చేశారు.

News October 1, 2024

రైలు ప్రయాణికులకు అలర్ట్

image

రైలు ప్రయాణాల్లో రిజర్వేషన్ చేయించుకున్నవారు టికెట్‌తో పాటు ఏదైనా ఐడీ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని రైల్వే అధికారులు సూచించారు. టీటీఈ అడిగినప్పుడు గుర్తింపు కార్డును చూపించకపోతే టికెట్ లేనట్లు పరిగణించి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఒకరి టికెట్‌తో మరొకరు ప్రయాణించడాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆధార్, ఓటర్, పాన్, లైసెన్స్ తదితరాల్లో ఏ ఐడీ కార్డునైనా చూపించవచ్చు.