News February 18, 2025
సిద్దిపేట: ఆర్చరీలో గోల్డ్ మెడల్.. సీపీ అభినందన

ఆర్చరీ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్ 2025 పోటీలలో బంగారు పతకం సాధించిన రశ్మిత రెడ్డిని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సిద్దిపేటకు చెందిన చిరుకోటి రశ్మిత రెడ్డి జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ ఛాంపియన్ షిప్-2025 పోటీల్లో బంగారు పతకాన్ని సాధించడం అభినందనీయమని అన్నారు.
Similar News
News January 15, 2026
ఆదిలాబాద్: పురపోరు.. MPTC ప్రచారం జోరు..!

పల్లెల్లో రాజకీయం వేడెక్కుతోంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారం జోరందుకుంటోంది. అదే ఊపుతో పల్లెలోనూ ఎంపీటీసీ ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మామడ మండలంలోని మొండిగుట్ట, తదితర గ్రామాల్లో యువకులు పార్టీలకతీతంగా ఒక అభ్యర్థిని ప్రకటించి తనకు సహకరించండి అని పల్లెల్లో గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులు ఇదేం కర్మరా బాబు అని అంటున్నారట.
News January 15, 2026
BISAG-Nలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్(BISAG-N)లో 6 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్( కంప్యూటర్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, సివిల్ ఇంజినీరింగ్), ఎంఈ, ఎంటెక్(అర్బన్ ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్) అర్హత కలిగిన వారు జనవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://bisag-n.gov.in/
News January 15, 2026
కలుపు మందుల పిచికారీ – ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఏ పంటకు సిఫార్సు చేసిన కలుపు మందులను ఆ పంటలో మాత్రమే సరైన మోతాదులో ఫ్లాట్ ప్యాన్ లేదా ఫ్లడ్ జెట్ నాజిల్‌ను ఉపయోగించి పిచికారీ చేయాలి. కలుపు మందులను ఇతర రసాయనాలతో (కీటక/శిలింద్రనాశినులు/పోషకాలు) కలిపి ఉపయోగిస్తే కలుపు మందుల సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. పంట మొలకెత్తాక ఉపయోగించే కలుపు మందులను.. కలుపు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారి చేసి సమర్థవంతంగా అరికట్టవచ్చు.


