News February 18, 2025
నేడు వల్లభనేని వంశీకి జగన్ పరామర్శ

AP: విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు పరామర్శించనున్నారు. బెంగళూరులో ఉన్న ఆయన ఉదయం 10.30 గంటలకు గాంధీనగర్ జిల్లా జైలు వద్దకు చేరుకుంటారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం తమ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.
Similar News
News February 8, 2026
నేడు ఈ పనులు చేయకండి!

ఈరోజు భాను సప్తమి. ఆదిత్యుడిని పూజించే పవిత్రమైన రోజు! ఇంతటి శుభదినానికి గౌరవమిస్తూ కొన్ని నియమాలు పాటించడం మంచిది. ‘మద్యానికి దూరంగా ఉండాలి. మాంసం ముట్టరాదు. ఒంటికి, తలకు నూనె పెట్టుకోరాదు. ఉల్లి, వెల్లుల్లి తినరాదు. బ్రహ్మచర్యం పాటించాలి’ అని సూర్యాష్టకంలో ఉంది. లేకపోతే 7 జన్మల పాటు రోగాలు, దరిద్రంతో బాధ పడతారని పండితులు చెబుతున్నారు. శుభ ఫలితాలకై నేడు ఏం చేయాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.
News February 8, 2026
జీడిమామిడిలో ఆకు, పూత, కాయమచ్చ తెగులు నివారణ

ఈ తెగులు వల్ల జీడిమామిడి చెట్టు ఆకులపై చిన్న, చిన్న లేత ఆకుపచ్చ మచ్చలు ఏర్పడి క్రమేపీ అవి పెరుగుతూ మచ్చ మధ్య ఎండిపోతుంది. చివరికి మొత్తం ఆకు ఎండి రాలిపోతుంది. పూత కాడలపై మచ్చలు వచ్చి పూత ఎండిపోయి రాలిపోతుంది. ఈ తెగులు నివారణకు రైతులు తొలుత తెగులు ఆశించిన కొమ్మలను తొలగించాలి. లీటరు నీటికి మ్యాంకోజెబ్ 1 గ్రాము లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా క్లోరోథాలోనిల్ 1ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News February 8, 2026
భాను సప్తమి: నేడు ఏం చేయాలంటే?

భాను సప్తమి నాడు ఆదిత్యుడి 12 పేర్లు పలుకుతూ సూర్య నమస్కారాలు చేయాలి. దీంతో శరీరానికి శక్తి, మనసుకు ప్రశాంతత లభిస్తాయి. అర్ఘ్యం సమర్పిస్తే కంటి చూపు మెరుగుపడుతుంది. జాతక దోషాలు పోతాయి. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం కోసం ‘ఆదిత్య హృదయం’ పఠించాలి. రామరావణ యుద్ధంలో రాముడికి అగస్త్య మహాముని ఈ స్తోత్రాన్ని ఉపదేశించారు. నేడు చేసే దానం ఎంతో ఫలప్రదం. భాను సప్తమి వ్రతం ఆచరించడం అన్నింటికంటే ఉత్తమం.


