News February 18, 2025

NRPT: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

image

ఈనెల 19న నారాయణపేటలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ మెర్సీ వసంత తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను సోమవారం కళాశాల ఆవరణలో విడుదల చేశారు. పదికి పైగా బహుళ జాతి కంపెనీలు మేళాలో పాల్గొంటాయని అన్నారు. SSC, INTER, DEGREE, PG, ITI, COMPUTER పరిజ్ఞానం ఉన్న వారు మేళాలో పాల్గొనాలని చెప్పారు.

Similar News

News April 18, 2026

గూగుల్, మెటాకు భారతీరెడ్డి లీగల్ నోటీసులు

image

గూగుల్, మెటా, X, యూట్యూబ్‌కు వైఎస్ జగన్ సతీమణి భారతీ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. సోషల్ మీడియాలో తనపై చేసిన తప్పుడు పోస్టులు, పరువుకు నష్టం కలిగించే పోస్టులను తొలగించాలని నోటీసులు ఇచ్చారు. కావాలనే తనను టార్గెట్ చేస్తూ పోస్టులు చేశారని పేర్కొన్నారు. తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్న అకౌంట్లను తొలగించాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. థింక్ ఆంధ్ర, M9 న్యూస్ సంస్థలకూ నోటీసులు పంపారు.

News April 18, 2026

రోహిత్, కోహ్లీ రికార్డ్ బద్దలుకొట్టిన స్మృతి మంధాన

image

ఉమెన్స్ టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన రికార్డ్ సృష్టించారు. T20Iల్లో(మెన్స్&ఉమెన్స్) అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచారు. స్మృతి 155 ఇన్నింగ్స్‌లో 4,244 రన్స్ చేసి రోహిత్(4,231), కోహ్లీ(4,188)ని వెనక్కి నెట్టారు. రోహిత్ 154, కోహ్లీ 117 ఇన్నింగ్సుల్లో ఈ పరుగులు చేశారు. నిన్న SAతో జరిగిన తొలి T20లో స్మృతి 13 రన్స్ కొట్టి ఈ ఫీట్ సాధించారు. అయితే ఈ మ్యాచులో IND 6 వికెట్ల తేడాతో ఓడింది.

News April 18, 2026

లోక్‌సభ నిరవధిక వాయిదా

image

లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. మూడు రోజులపాటు సాగిన సమావేశాలు నేటితో ముగిశాయి. నిన్న మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. ఉభయ సభలు నిరవధిక వాయిదా పడిన అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పలువురు ఎంపీలు ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. భేటీ అయిన వారిలో పీఎం మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.