News February 18, 2025
ముమ్మిడివరం : మైనర్ బాలిక కిడ్నాప్… అత్యాచారం…

ముమ్మిడివరం (M)కి చెందిన 15 ఏళ్ల మైనర్ బాలిక (8వ తరగతి)ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్ఐ జ్వాలాసాగర్ సోమవారం తెలిపారు. అనాతవరానికి చెందిన దుర్గాప్రసాద్ సోమవారం స్కూలుకు వెళ్తున్న బాలికకు మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసి అమలాపురంలో అత్యాచారం చేశాడన్నారు. బాలిక కిడ్నాప్ పై ఆమె పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. విషయం తెలిసి నిందితుడు పరారయ్యాడన్నారు.
Similar News
News April 18, 2026
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం BJP ఓటమే: సీఎం రేవంత్

TG: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం BJP ఓటమి అని, విపక్షాల ఐక్యతతో కేంద్రం ఓడిందని CM రేవంత్ అన్నారు. ‘NDA నిజాయతీగా బిల్లు తీసుకురాలేదు. 3 బిల్లుల పేరుతో డీలిమిటేషన్ అమలుకు కుట్ర చేసింది. 2023 మహిళా బిల్లును యథాతథంగా అమలు చేస్తే మద్దతిస్తాం. మహిళా రిజర్వేషన్లలోనూ SC, ST, OBC కోటాలు ఉండాలి’ అని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. BJPకి 400సీట్లు వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్నారు.
News April 18, 2026
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపు

కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. 2 శాతం డీఏ (కరవు భత్యం) పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. చివరిసారిగా గతేడాది అక్టోబర్‌లో డీఏ పెంచింది.
News April 18, 2026
బిల్లుపై కేంద్రం Vs ప్రతిపక్షాలు.. మీ అభిప్రాయమేంటి?

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రజల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. మహిళలకు మంచి చేయాలనుకున్న కేంద్రం.. పాత రిజర్వేషన్ బిల్లునే పెట్టాల్సిందని, దానికి డీలిమిటేషన్‌ను లింక్ చేయడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. డీలిమిటేషన్ వల్ల అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందని, ప్రతిపక్షాలకు మహిళల పట్ల గౌరవం లేకనే ఉమెన్ బిల్లును వ్యతిరేకించాయని మరికొందరు అంటున్నారు. బిల్లుపై మీ ఒపీనియన్?


