News February 18, 2025

సూక్ష్మ సేద్యం సబ్సిడీలు ఇలా(1/2)

image

AP: ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – పర్ డ్రాప్ మోర్ క్రాప్’ స్కీమ్‌లో భాగంగా సూక్ష్మ సేద్యం కింద బిందు, తుంపర పరికరాలకు ప్రభుత్వం సబ్సిడీలు ఖరారు చేసింది. వీటికోసం సమీపంలోని వ్యవసాయ కేంద్రాల్లో సంప్రదించాలి. మొత్తంగా 7.5 లక్షల ఎకరాలకు పరికరాలు అందిస్తారు.
✒ 5ఎకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ సన్న, చిన్నకారు రైతులకు పరికరాలపై 100% సబ్సిడీ
✒ ఇతర సన్న, చిన్నకారు అన్నదాతలకు 90% సబ్సిడీ(గరిష్ఠంగా ₹2.18 లక్షలు)

Similar News

News October 18, 2025

8,113 పోస్టులు.. ప్రైమరీ కీ విడుదల

image

8,113 NTPC గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి సంబంధించి సీబీటీ -2 పరీక్షల ప్రైమరీ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి రెస్పాన్స్ షీట్ పొందవచ్చు. కీపై అభ్యంతరాలుంటే ఈ నెల 23 వరకు తెలుపవచ్చు. ఈ నెల 13న RRB సీబీటీ -2 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

News October 18, 2025

ఘోర ప్రమాదం… 8 మంది భక్తుల మృతి

image

మహారాష్ట్రలోని చాంద్‌షాలి ఘాట్ వద్ద పికప్ వ్యాను లోయలో పడి 8మంది భక్తులు మరణించారు. ఇష్టదైవం అస్తంబా దేవీయాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న భక్తుల వ్యాను ఘాట్ రోడ్డు మలుపు వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయింది. వ్యాను తునాతునకలు కాగా భక్తులు వాహనం కింద పడిపోయారు. 8మంది అక్కడికక్కడే మరణించగా మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. అత్యంత వేగంతో వెళ్తూ డ్రైవర్ పట్టుకోల్పోవడమే దీనికి కారణంగా పేర్కొంటున్నారు.

News October 18, 2025

జిప్‌మర్‌లో 118 పోస్టులు

image

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(JIPMER)118 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ, PG, MD, MS, DNB, DM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు నవంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.