News February 18, 2025

నర్సీపట్నంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్

image

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రెండు రోజుల నుంచి తన స్వగ్రామమైన నర్సీపట్నంలో సందడి చేస్తున్నారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ ఇంటికి తల్లిని చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా నర్సీపట్నం పరిసర గ్రామాలకు చెందిన అభిమానులు ఆయన్ను కలిసి ఫొటోలు తీసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణ రాజు సోమవారం ఆయనతో భేటీ అయ్యారు.

Similar News

News January 9, 2026

నగరవాసులకు జీహెచ్ఎంసీ తీపి కబురు!

image

నగరవాసులకు జీహెచ్ఎంసీ తీపి కబురు అందించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆస్తిపన్ను బకాయిదారులకు భారీ ఊరటనిస్తూ వన్ టైమ్ స్కీమ్(టీఎస్)ను ప్రకటించింది. దీర్ఘకాలంగా పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలపై ఉన్న వడ్డీలో 90 శాతాన్ని మాఫీ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్టన్ తెలిపారు. ఈరాయితీ జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రైవేట్ ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులకు కూడా వర్తిస్తుందన్నారు.

News January 9, 2026

హజ్ యాత్రకు వీరు అనర్హులు: సౌదీ ప్రభుత్వం

image

హజ్ యాత్రకు సంబంధించి సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6 వర్గాల వారికి అనుమతి లేదని స్పష్టం చేసింది. డయాలసిస్ రోగులు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయ వ్యాధులతో బాధపడేవారు, కీమోథెరపీ చేయించుకున్న క్యాన్సర్ రోగులు, వైకల్యంతో ఉన్నవారు, అలాగే 28 వారాలు నిండిన గర్భిణీలను అనర్హులుగా ప్రకటించింది. మరోవైపు ప్రైవేట్ గ్రూపుల ద్వారా వెళ్లేవారు ఈ నెల 15లోపు బుకింగ్‌లు పూర్తి చేయాలని హజ్ సంఘాలు సూచించాయి.

News January 9, 2026

జనవరి 09: చరిత్రలో ఈరోజు

image

*ప్రవాస భారతీయుల దినోత్సవం (1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగివచ్చిన తేదీ)
*1969: మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభం
*1922: నోబెల్‌ బహుమతి గ్రహీత హరగోవింద్ ఖొరానా జననం (ఫొటోలో)
*1985: తెలుగు జానపద, సినీ గీతరచయిత మిట్టపల్లి సురేందర్ జననం
*1971: బంగారీ మామ పాటల రచయిత కొనకళ్ల వెంకటరత్నం మరణం