News February 18, 2025

కనకగిరి ఫారెస్ట్‌‌లో నిపుణుల పర్యటన

image

కనకగిరి ఫారెస్ట్‌‌లో వన్యప్రాణి నిపుణులు 12గంటల పాటు కాలినడకన పర్యటించారు. 12 మంది నిపుణులు 4 కి.మీ.ల అడవిని పరిశీలించి వృక్షాలు, జంతువులకు సంబంధించిన వైవిధ్యాన్ని కనుగొన్నారు. 65 పక్షిజాతులు, 5 క్షీరద జాతులు, 5 చేప జాతులను డాక్యుమెంటరీ రూపంలో రికార్డు చేశారు. ఫారెస్ట్‌ ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణుల రకాలు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News November 6, 2025

జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

image

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి అత్యల్పంగా గోవిందారం, మన్నెగూడెంలో 18.4℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గొల్లపల్లి, పూడూర్, కథలాపూర్ 19, మద్దుట్ల 19.2, పెగడపల్లి 19.3, తిరుమలాపూర్ 19.4, మల్యాల, జగ్గసాగర్, రాఘవపేట 19.5, మల్లాపూర్, కోరుట్ల 19.6, నేరెళ్ల, రాయికల్, ఐలాపూర్ 19.7, గోదూరు, పొలాస, సారంగాపూర్ 19.8, మేడిపల్లి 19.9, జగిత్యాలలో 20.1℃గా నమోదైంది.

News November 6, 2025

వెట్‌ల్యాండ్‌లలో నిర్మాణాలు నిషేధం: అదనపు కలెక్టర్

image

వెట్‌ల్యాండ్‌ల సంరక్షణ ద్వారానే పర్యావరణానికి మేలు జరుగుతుందని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో వెట్‌ల్యాండ్‌ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 467 వెట్ ల్యాండ్‌లు 8,911 హెక్టార్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. వాటిల్లో నిర్మాణాలు చేపట్టడం, వ్యర్థాలు వేయడం నిషేధమని ఆయన తెలిపారు. భూ యాజమాన్యం మారదనే విషయాన్ని రైతులు గమనించాలని, ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.

News November 6, 2025

ఏలూరు: ‘రెండో శనివారం సెలవు లేదు’

image

మొంథా తుఫాన్ ప్రభావంతో అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో ఏలూరు జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రోజుకు బదులుగా నవంబర్ 8, డిసెంబర్ 13, ఫిబ్రవరి 14 తేదీల రెండో శనివారాల్లో పాఠశాలలు పనిచేయాలని జిల్లా విద్యా అధికారి వెంకటలక్ష్మమ్మ ఆదేశాలు జారీ చేశారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలు తప్పనిసరిగా ఈ రోజుల్లో నిర్వహించాలన్నారు.