News February 18, 2025
NRPT: గల్లంతైన తండ్రీకొడుకులు మృతి

బావిలో పడి <<15494116>>గల్లంతైన తండ్రీకొడుకులు<<>> మృతిచెందిన ఘటన దామరగిద్ద మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తన భార్య గ్రామమైన మండల పరిధిలోని మద్దెలబీడులో కర్ణాటకకు చెందిన శివయ్య(35) కుటుంబంతో ఉంటున్నారు. తన కుమారుడు(5) ప్రమాదవశాత్తుబావిలో పడిపోగా.. కాపాడటానికి వెళ్లి తను కూడా మునిగిపోయారు. వారిని సహాయక సిబ్బంది గాలించి మృతదేహాలను వెలికితీశారు. తండ్రీకుమారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Similar News
News January 18, 2026
వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తవ్వాలి: CM

AP: ప్రాధాన్యతల వారీగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని CM చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేయాల్సిన కీలక ప్రాజెక్టులపై సమీక్షించారు. ‘గతేడాది గడుపు పెట్టుకుని హంద్రీ-నీవా కాల్వ వెడల్పు పనులు పూర్తి చేశాం. పోలవరం పనులు పరుగులు పెట్టించాం. 2026లో వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తవ్వాలి’ అని ఆదేశించారు. నల్లమల సాగర్ సహా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులపైనా చర్చించారు.
News January 18, 2026
MHBD: పారదర్శకంగా మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారు: కలెక్టర్

పారదర్శకంగా మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారు చేసినట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. జిల్లాలోని MHBD, తొర్రూర్, మరిపెడ, డోర్నకల్, సూర్యాపేట మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్ధతిలో పారదర్శకగా ఈ కేటాయింపులు చేపట్టారు. 2011 జనాభా లెక్కలు, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ ప్రక్రియ నిర్వహించామని కలెక్టర్ వివరించారు.
News January 18, 2026
సిద్దిపేట: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్స్, ఆర్ఆర్బీ, ఎస్ఐ, కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షలకు 5 నెలల ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. శనివారం ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డైరెక్టర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


