News March 21, 2024
వివాదంలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ డైలాగ్స్?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ డైలాగ్స్‌పై వివాదం రాజుకుంటోంది. ఎన్నికల కోడ్ నడుస్తుంటే.. పవన్ తన జనసేన పార్టీ రాజకీయ ప్రచారంలో ఈ డైలాగులు వాడుకున్నారని కొందరు విమర్శిస్తున్నారు. తాజాగా దీనిపై ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా స్పందించారు. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ టీజర్లో రాజకీయ ప్రచారాంశాలు ఉంటే మూవీ టీమ్ తమ అనుమతి తీసుకోవాలని అన్నారు. త్వరలోనే ఆయన టీజర్ చూడనున్నారు.
Similar News
News November 25, 2024
‘ప్రీమియర్స్’ సేల్స్‌లో పుష్ప-2 సంచలనం
అల్లు అర్జున్-రష్మిక జంటగా నటించిన పుష్ప-2 మూవీ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. డిసెంబర్ 4న అమెరికా ప్రీమియర్స్ కోసం అత్యంత వేగంగా 50,000 టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డు సాధించింది. ‘పుష్ప కేవలం చరిత్ర సృష్టించట్లేదు. ప్రతి చోటా తన రూల్‌ను ముద్రిస్తున్నాడు’ అని మేకర్స్ రాసుకొచ్చారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.
News November 25, 2024
పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు గుడ్ న్యూస్
TG: పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉపయోగపడే అంశాలపై ‘జనరల్ స్టడీస్ ఫర్ ఆల్’ పేరుతో టీ-సాట్ ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల పాఠ్యాంశాలపై ఇవాళ్టి నుంచి 5 నెలల పాటు 600 ఎపిసోడ్లు ప్రసారం చేయనున్నట్లు టీ-సాట్ సీఈవో వేణుగోపాల్ తెలిపారు. టీ-సాట్ నిపుణ ఛానల్లో మ.12-1 గంటల వరకు, మ.3-4 గంటల వరకు, విద్య ఛానల్లో రా.8-10 గంటల వరకు టెలికాస్ట్ ఉంటుందని పేర్కొన్నారు.
News November 25, 2024
భూకేటాయింపులు రద్దు చేస్తూ సుప్రీం తీర్పు
TG: జీహెచ్ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులు రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు గతంలో ప్రభుత్వాలు భూకేటాయింపులు చేశాయి. వీటిని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు కాగా, సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ప్రభుత్వానికి సొసైటీలు చెల్లించిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది.