News February 18, 2025

HYD: భార్యను పంపమని ఆమె భర్తనే అడిగాడు..!

image

పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి నిప్పంటించుకున్న ఘటన మధురానగర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. యాదగిరినగర్‌లో దంపతులు నివాసం ఉంటున్నారు. భార్యకు సూర్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మద్యం తాగి ఇంటికి వచ్చి ‘మీ భార్యను నాకు ఇచ్చేయ్, జీవితాంతం సంతోషంగా చూసుకుంటా’అని భర్తతో అన్నాడు. భర్త ఆగ్రహించడంతో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News November 8, 2025

కర్ణాటక స్పెషల్ డ్రైవ్… 102 ప్రైవేట్ బస్సులు సీజ్

image

కర్నూలు దగ్గర <<18155705>>బస్సు<<>> ప్రమాదంలో 19 మంది మృతితో కర్ణాటక GOVT PVT ట్రావెల్స్‌పై కఠిన చర్యలకు దిగింది. 12 ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. OCT24 నుంచి NOV 5 వరకు 4452 బస్సుల్ని తనిఖీ చేసి 102 బస్సుల్ని సీజ్ చేసింది. 604 కేసులు నమోదు చేసిన అధికారులు ₹1,09,91,284 జరిమానా వసూలు చేశారు. కాగా AP, TGల్లో మాత్రం కొద్దిరోజులు హడావుడి చేసి తరువాత మిన్నకుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News November 8, 2025

సింగరేణి ఉచిత ప్రమాద బీమా దేశానికే ఆదర్శం: CMD

image

కొత్తగూడెం: సింగరేణిలో ఉద్యోగులు, ఒప్పంద కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ప్రారంభించిన ఉచిత ప్రమాద బీమా పథకం దేశంలోనే తొలిసారిగా అమలు చేసి, ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలిచిందని సీఎండీ ఎన్.బలరాం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇప్పుడు ఈ పథకాన్ని తమ సంస్థల్లో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. ఈ పథకం అమలుకు సహకరించిన బ్యాంకులతో ఆయన సమావేశం నిర్వహించారు.

News November 8, 2025

జన్నారం: గల్లంతైన యువకుని కోసం గాలింపు

image

జన్నారం మండలం బాదంపల్లి శివారులోని గోదావరిలో గల్లంతైన యువకుని కోసం పోలీసులు, గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. జన్నారం మండల కేంద్రానికి చెందిన గుండా శ్రవణ్ శనివారం నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. శ్రావణ్ జన్నారంలో ఐరన్, హార్డ్‌వేర్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. అతని నాయనమ్మ సంవత్సరికం చేసి నదీ స్నానాకి వెళ్లి ఈ రోజు ఉదయం గల్లంతయ్యాడు.