News March 21, 2024
ప.గో: ఇంగ్లీష్ పరీక్షకు 665 మంది విద్యార్థులు డుమ్మా!

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేడు నిర్వహించిన SSC పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌వి రమణ తెలిపారు. ఇంగ్లీష్ పరీక్షకు 21,238 మందికి గాను 20,573 మంది హాజరయ్యారని, 665 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.
Similar News
News March 9, 2026
ఉమ్మడి జిల్లా సర్వోదయ మండలి ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీలక్ష్మి

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సర్వోదయ మండలి ఉపాధ్యక్షురాలిగా రిటైర్డ్ లెక్చరర్ చేకూరి ఝాన్సీలక్ష్మి నియమితులయ్యారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నియామకం చేసినట్లు కార్యదర్శి G.V.S.D ప్రసాద్ తెలిపారు. DNR కాలేజీలో పనిచేసిన ఆమె సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని ఝాన్సీలక్ష్మికి అభినందనలు తెలుపుతూ సర్వోదయ ఆశయాల పట్ల ఆకాంక్షించారు.
News March 9, 2026
ప.గో: నేడు జిల్లాకు షర్మిల రెడ్డి

నేడు పశ్చిమగోదావరి జిల్లాకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కాళ్ల మండలం సంత మార్కెట్లో ఉపాధి హామీ కూలీలతో చర్చిస్తారని, అనంతరం 3 గంటలకు భీమవరం ప్రకాశం చౌక్‌లో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారని జిల్లా అధ్యక్షుడు సీతారామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉపాధి హామీ కూలీలు పాల్గొంటారని అన్నారు.
News March 9, 2026
భీమవరం వన్‌టౌన్‌లో ‘పీజీఆర్‌ఎస్’: ఎస్పీ

భీమవరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరుగుతుందన్నారు. అర్జీదారులు ఈ మార్పును గమనించి, తమ విన్నపాలతో నేరుగా వన్‌టౌన్ స్టేషన్‌కు వచ్చి అధికారులను సంప్రదించాలని ఎస్పీ కోరారు.


