News February 18, 2025

సంగారెడ్డిలో యువకుడి మర్డర్.. UPDATE

image

సంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు దారుణ <<15474129>>హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. తన కూతురితో చనువుగా ఉంటున్నాడన్న కారణంతో నిజాంపేట మండలం రాంచందర్ తండాకు చెందిన లారీ డ్రైవర్ దశరథ్(26)ను ఈనెల 12న అమ్మాయి తండ్రి గోపాల్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోపాల్, ఆయన భార్య విజ్జీబాయి, మరో ఇద్దరిని నిందితులుగా గుర్తించగా నిన్న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News November 10, 2025

JIO యూజర్స్ BSNL నెట్‌వర్క్ వాడుకోవచ్చు!

image

జియో 28 డేస్ వ్యాలిడిటీతో రెండు కొత్త(రూ.196, రూ.396) రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చింది. వీటితో రీఛార్జ్ చేసుకుంటే మారుమూల ప్రాంతాల్లో జియో సిగ్నల్ లేనప్పుడు BSNL నెట్‌వర్క్ వాడుకోవచ్చు. వీటిని ఇంట్రా-సర్కిల్ రోమింగ్(ICR) ప్లాన్స్ అంటారు. ప్రస్తుతం ఇవి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అందుబాటులో ఉన్నాయి. రీఛార్జ్ చేశాక ఎప్పుడైతే BSNL నెట్‌వర్క్ ఫస్ట్ వాడతారో అప్పుడే ప్లాన్ యాక్టివేట్ అవుతుంది.

News November 10, 2025

MBNR: ఈనెల 12న చెస్ ఎంపికలు.. ఎస్‌జీఎఫ్‌ ప్రకటన

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో అండర్-14, 17, 19 బాల, బాలికల విభాగాల్లో చెస్ ఎంపికలను నిర్వహించనున్నారు. ఈ నెల 12న మహబూబ్‌నగర్‌లోని లిటిల్ స్కాలర్ స్కూల్‌లో ఎంపికలు జరుగుతాయని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్, టెన్త్ మెమో (U-19)తో ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలని ఆమె సూచించారు.

News November 10, 2025

NTR: ఆ నిధులతో ఏం చేస్తారో..?

image

గత ఏడాది వరదలకు దెబ్బతిన్న బుడమేరు, కాలువల మరమ్మతులకు సంబంధించిన రూ. 60-70 కోట్ల నిధులు ఎనిమిది నెలల తర్వాత మే నెలలో విడుదలయ్యాయి. దీంతో పనులు ఆలస్యం కావడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఎప్పుడో పడిన గండ్లకే మళ్లీ మట్టి తీసి పనులు చేస్తారనడం నిరుపయోగమని, ఆ నిధులను ఇటీవల వర్షాలకు జరిగిన నష్టం పూడ్చేందుకు వాడాలని డిమాండ్ చేస్తున్నారు.