News February 18, 2025
పట్టిసీమ క్షేత్రానికి బ్రిడ్జి నిర్మించాలని కలెక్టర్‌కు వినతి

శివరాత్రి ఉత్సవాల్లో భక్తులు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం <<15490024>>పట్టిసీమ క్షేత్రాన్ని సందర్శించిన<<>> ఆమె ఉత్సవాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రామారావు అనే వృద్ధుడు శివక్షేత్రానికి రాకపోకలు సాగించేందుకు వంతెన నిర్మించాలని నిలదీశారు. అది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ బదులిచ్చారు.
Similar News
News April 18, 2026
ఇరాన్, లెబనాన్‌లో మేం సాధించింది ఇదే: ఇజ్రాయెల్

ఇరాన్, లెబనాన్‌పై దాడుల్లో తాము సాధించిన విజయాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ట్వీట్ చేసింది. ఇరాన్‌లో 28 మంది సీనియర్ లీడర్లను అంతం చేశామని, 10,800 దాడులు చేశామని తెలిపింది. 250 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను నాశనం చేశామని వెల్లడించింది. అటు లెబనాన్‌లో 1700 మందికి పైగా టెర్రరిస్టులను చంపేశామని, 5 వేలకు పైగా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని వివరించింది.
News April 18, 2026
NZB: జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు

నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని రెండేళ్ల కాల పరిమితికి ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ ఛైర్మన్‌గా ఉన్న కమిటీలో సభ్యులుగా జి.సాయి ప్రసాద్, బాల కుమార్, నర్సింహులు, భూపతి, రామదయానంద్, మహ్మద్ గౌస్, శ్రీనివాస్, శ్రీకాంత్, మాజిద్, జాన్సన్‌లను నియమించారు.
News April 18, 2026
అనకాపల్లి: ‘భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలి’

జలధార-నీటి భద్రత ద్వారా భూగర్భ జలాల నీటిమట్టం పెంపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. అనకాపల్లి కలెక్టరేట్‌లో శుక్రవారం ఎంపీడీవోలు, ఇరిగేషన్ అధికారులతో జలధార-నీటి భద్రతపై సమీక్షించారు. గ్రామాల్లో చెరువుల అభివృద్ధి పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించాలని సూచించారు. పంట కాలువల పూడికతీత, గేట్ల మరమ్మతు పనులు చేపట్టి సాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరచాలన్నారు.


