News February 18, 2025
అకౌంట్లోకి డబ్బులు.. సీఎం కీలక ప్రకటన

AP: దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేశారు. పలువురికి డబ్బులు జమ కావడం లేదన్న ఫిర్యాదులపై సమాచారం సేకరించాలన్నారు. అటు సిలిండర్ డెలివరీ చేసే సమయంలో డబ్బులు అడుగుతున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై యాక్షన్ తీసుకోవాలని ఏజెన్సీలను, అధికారులను సీఎం ఆదేశించారు.
Similar News
News April 19, 2026
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి: కలెక్టర్

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News April 19, 2026
RCBకి శాపంగా గ్రీన్ జెర్సీ!

ఆర్సీబీకి మరోసారి గ్రీన్ జెర్సీ కలిసి రాలేదు. పర్యావరణ పరిరక్షణ కోసం 2011 సీజన్ నుంచి బెంగళూరు ప్లేయర్లు ఒక్కో మ్యాచులో ఈ గ్రీన్ కలర్ జెర్సీ ధరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ జెర్సీలో 15 మ్యాచులు ఆడగా అందులో తొమ్మిదింట్లో (ఇవాళ ఢిల్లీతో కలిపి) ఓడింది. ఇక చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆడిన తొలి, 50వ, 100వ మ్యాచుల్లో ఓటమిపాలు కావడం గమనార్హం.
News April 18, 2026
జర్నీలో వాంతులు చేసుకుంటున్నారా?

చెవిలో ఉండే లాబ్రింథ్స్, యూట్రికెల్ భాగాలు మెదడుకు సంకేతాలు సరిగా అందించకపోతే ప్రయాణాల్లో వాంతులు చేసుకోవడం, కళ్లు తిరగడం లాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. వెనుక సీట్లో బదులు ముందు కూర్చోవాలని సూచిస్తున్నారు. విండో తెరిచి స్వచ్ఛమైన గాలికి సేద తీరాలంటున్నారు. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని, తులసి ఆకులను నమలాలని సూచిస్తున్నారు. అల్లం టీ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుందంటున్నారు.


