News March 21, 2024
మోస్ట్ ఫేవరెట్ స్పోర్ట్స్ స్టార్‌గా కోహ్లీ
దేశంలోనే మోస్ట్ ఫేవరెట్ స్పోర్ట్స్ స్టార్‌గా టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలిచినట్లు ఓర్మాక్స్ మీడియా ప్రకటించింది. అతడి తర్వాతి స్థానాల్లో మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, క్రిస్టియానో రొనాల్డో, సచిన్, లియోనల్ మెస్సీ, నీరజ్ చోప్రా, సునీల్ ఛెత్రీ నిలిచారు. దేశంలోనే మోస్ట్ పాపులర్ స్పోర్ట్‌గా క్రికెట్ నిలిచింది. క్రికెట్ తర్వాత ఫుట్‌బాల్, కబడ్డీ, రెజ్లింగ్, హాకీ ఉన్నాయి.
Similar News
News November 25, 2024
STOCK MARKETS: 400 పాయింట్ల లాభంతో నిఫ్టీ ఆరంభం
అనుకున్నదే జరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 24,300 (+400), సెన్సెక్స్ 80,286 (+1175) వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, రియాల్టి, O&G రంగాల షేర్లకు డిమాండ్ నెలకొంది. నిఫ్టీలో JSW స్టీల్, ఇన్ఫీ మినహా 48 కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి. శ్రీరామ్ ఫిన్, M&M, LT, BEL, BPCL టాప్ గెయినర్స్. నిఫ్టీ చివరి 2 సెషన్లలోనే 800 పాయింట్ల మేర పెరగడం విశేషం.
News November 25, 2024
FLASH: భారీ విజయం దిశగా భారత్
పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్ భారీ ఓటమి దిశగా సాగుతోంది. 79 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. ఇక భారత్ గెలుపు లాంఛనమే. నాథన్ 0, ఖవాజా 4, కమిన్స్ 2, లబుషేన్ 3, స్టీవెన్ స్మిత్ 17 పరుగులకు ఔటయ్యారు. ట్రావిస్ హెడ్(45) క్రీజులో ఉన్నారు. బుమ్రా 2, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టారు. కాగా ఆసీస్ ఇంకా 455 పరుగులు చేయాల్సి ఉంది.
News November 25, 2024
భారత డ్రెస్సింగ్ రూంలో హిట్‌మ్యాన్
కెప్టెన్ రోహిత్ శర్మ టీమ్ ఇండియా డ్రెసింగ్ రూంలో కనిపించారు. కోచ్ గంభీర్‌తో కలిసి మ్యాచ్ వీక్షిస్తున్నారు. నిన్న పెర్త్ స్టేడియానికి చేరుకున్న రోహిత్.. ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్నారు. రెండో టెస్టుకు అందుబాటులో ఉంటారు. బిడ్డ జన్మించడంతో రోహిత్ తొలి టెస్టుకు దూరమయ్యారు.