News February 18, 2025
వికారాబాద్: 1.70 లక్షల మందికి రైతు భరోసా

రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. వికారాబాద్ జిల్లాలో 1.70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.136,48,29,701 జమ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మూడు ఎకరాల వరకు భూమికి డబ్బులు జమ అవుతున్నాయి. జిల్లాలో మొత్తం 2,75,513 రైతులకు చెందిన 1,14,492 ఎకరాల భూమికి రూ.344,665,23,099 జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా మార్చి చివరి నాటికి అర్హులందరికీ సాయం అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
Similar News
News January 16, 2026
మళ్లీ తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. 10 రోజులు జాగ్రత్త!

TG: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ చలి తీవ్రత పెరగనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు వెస్ట్ తెలంగాణలో ఇవాళ రాత్రి సగటు ఉష్ణోగ్రతలు 12-14 డిగ్రీలుగా నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. రాబోయే 10 రోజులు ఈ తరహా వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు 29-30 డిగ్రీలుగా ఉంటాయని వెల్లడించారు.
News January 16, 2026
చిత్తూరుకు 32, తిరుపతికి 36 రేషన్ టెస్టింగ్ కిట్లు…!

చిత్తూరు జిల్లాకు 32, తిరుపతి జిల్లా 36 టెస్టింగ్ కిట్లను రాష్ట్రప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ కిట్లతో తనిఖీ సమయంలో రేషన్ బియ్యం నమూనాపై ప్రత్యేక ద్రావణం వేస్తారు. అది ప్రభుత్వ రేషన్ బియ్యమే అయితే బియ్యం రంగు నీలం(నీలం–నలుపు)గా మారుతుంది. రేషన్‌కు సంబంధించినది కాకపోతే రంగు మార్పు ఉండదు. ఇలా కొద్ది నిమిషాల్లోనే స్పష్టమైన ఫలితం రావడంతో అక్రమ తరలింపులు, మళ్లింపు ప్రయత్నాలు అక్కడికక్కడే గుర్తించవచ్చు.
News January 16, 2026
ADB రిమ్స్‌లో పోస్టులకు దరఖాస్తులు

ADB రిమ్స్ వైద్య కళాశాలలో వివిధ విభాగంలో డాక్టర్ పోస్టులను గౌరవ వేతనంతో పాటు కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేస్తున్నట్లు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. అర్హులైన ట్యూటర్స్, సీఎంఓ, సివిల్ అసిస్టెంట్ సర్జన్, సీనియర్ రెసిడెంట్స్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. వివరాలకు rimsadilabad.org, adilabad.telangana.gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలన్నారు. ఈ నెల 23న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.


