News February 18, 2025
మెదక్: అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం

అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యమైనట్టు మెదక్ సీఐ నాగరాజు తెలిపారు. మెదక్ పట్టణానికి చెందిన మంగలి రేణుక ప్రైవేట్ ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తుంది. ఆమె కనిపించకపోవడంతో గత నెల 8న మిస్సింగ్ కేసు నమోదైంది. రేణుక మృతదేహం చిన్నశంకరంపేట మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలో గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టామని త్వరలోనే కేసు వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.
Similar News
News January 19, 2026
సంగారెడ్డి: ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల

జిల్లాలోని 5 నుంచి 10 వ తరగతి వరకు చదువుతున్న ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను http://telanganaepass.cgg.gov.inలో ఈనెల 31 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News January 19, 2026
నిజామాబాద్‌లో 13.2°C ఉష్ణోగ్రత

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. నిజామాబాద్‌లో అత్యల్పంగా 13.2°C, సాలూరాలో 13.2, చిన్న మావంది 13.5, ఏర్గట్ల 14.0, మెండోరా 14.1, మంచిప్ప 14.4, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్ 14.5, బాల్కొండ, వేంపల్లి 14.6, మదన్ పల్లె 14.7, గోపన్న పల్లి 14.9°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News January 19, 2026
RR: 5 విడతల్లో సర్పంచ్‌లకు శిక్షణ

ఈ నెల19 నుంచి 23 వరకు నూతన సర్పంచ్‌లకు మొదటి విడతలో శిక్షణను ఇవ్వనున్నారు. మొదటి విడతలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీలకు శిక్షణ ఇవ్వనున్నారు. 2వ విడతలో మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్, 3వ విడతలో కందుకూరు, నందిగామ, మహేశ్వరం, కేశంపేట, 4వ విడతలో ఫరూఖ్‌నగర్, కొత్తూరు, కొందుర్గు, చౌదరిగూడ, 5వ విడతలో అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, శంషాబాద్ సర్పంచ్‌లకు ఇవ్వనున్నారు.


