News March 21, 2024

ఆ వీడియోల గుర్తింపు యూట్యూబ్‌లో ఇక సులువు

image

AI పుణ్యమా అని ఏది అసలు వీడియోనో.. ఏది ఆర్టిఫిషియల్ వీడియోనో గుర్తించడం కష్టంగా మారింది. ఈ క్రమంలో దీనికి చెక్ పెట్టేందుకు యూట్యూబ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. యూజర్లు అసలైన కంటెంట్, ఏఐతో రూపొందించిన వీడియోకు మధ్య వ్యత్యాసాన్ని తెలపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఏఐ ద్వారా ఏమైనా క్రియేట్ చేస్తే ఛానల్ నిర్వహిస్తున్న వ్యక్తులు వెల్లడించాలి. దీని కోసమే క్రియేటర్ స్టూడియోలో కొత్త టూల్ తీసుకొచ్చామంది.

Similar News

News November 25, 2024

తక్కువ ధరకే అమ్ముడైన టాలెంటెడ్ ప్లేయర్స్

image

IPL వేలంలో కొన్ని ఫ్రాంచైజీలు టాలెంటెడ్ ప్లేయర్లను తక్కువ ధరకే దక్కించుకున్నాయి. ఆల్‌రౌండర్ మార్‌క్రమ్‌ను లక్నో(రూ.2కోట్లు), కీలక ఇన్నింగ్స్ ఆడే త్రిపాఠిని CSK(రూ.3.4కోట్లు) కొనుగోలు చేసింది. భారీ సిక్స్‌లు కొట్టే మ్యాక్స్‌వెల్‌ను PBKS రూ.4.2కోట్లకు, Mమార్ష్‌ను లక్నో రూ.3.4కోట్లకే సొంతం చేసుకున్నాయి. స్టార్ బ్యాటర్ డికాక్‌ను KKR రూ.3.60కోట్లు, రచిన్ రవీంద్రను CSK రూ.4కోట్లకే ఖాతాలో వేసుకున్నాయి.

News November 25, 2024

నోటీసులపై నటుడు అలీ స్పందన

image

అక్రమ నిర్మాణాలు ఆపాలని తనకు జారీ చేసిన నోటీసులపై నటుడు అలీ స్పందించారు. ఒక కన్వెన్షన్ సెంటర్ కోసం తన స్థలం లీజుకు ఇచ్చినట్లు చెప్పారు. కట్టడాలపై లీజుదారులే సమాధానం ఇస్తారన్నారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ (M) ఎక్మామిడిలోని ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ కార్యదర్శి శోభారాణి అలీకి నిన్న నోటీసులిచ్చారు. కట్టడాలను నిలిపివేయాలని అందులో పేర్కొన్న విషయం తెలిసిందే.

News November 25, 2024

శ్రీవారి దర్శనానికి 10 గంటల టైమ్

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏడుకొండలవాడిని నిన్న 75,147 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,096 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.16 కోట్లు లభించింది.