News February 18, 2025

కూకట్‌పల్లి: సంప్రదాయబద్ధంగా శునకానికి అంత్యక్రియలు

image

మూసాపేట్ ఆంజనేయ నగర్‌కు చెందిన సోమా ప్రభాకర్ 14 ఏళ్ల క్రితం తనకు దొరికిన కుక్క పిల్లను చేరదీసి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. తనకు ఆడపిల్లలు లేకపోవడంతో ఆ శునకానికి కుట్టి అని పేరు పెట్టి కుటుంబ సభ్యుడిగా చూసుకుంటున్నారు. అనారోగ్య కారణాలతో కుక్కపిల్ల సోమవారం మృతి చెందింది. దీంతో వారు శోకసంద్రంలో మునిగారు. శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించి కన్నీటి వీడ్కోలు పలికారు.

Similar News

News January 14, 2026

నల్గొండ: 23, 24 తేదీల్లో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

image

జిల్లాకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ నెల 23, 24 తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ సెక్రటరీ ఎన్. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల జర్నలిస్టులు 20 తేదిలోగా నల్గొండ పౌర సంబంధాల అధికారిని సంప్రదించాలన్నారు.

News January 14, 2026

నిజామాబాద్: ఆర్టీసీ స్పెషల్ వసూళ్లు !

image

సంక్రాంతి నేపథ్యంలో నిజామాబాద్ రీజియన్‌లోని ఆరు డిపోల నుంచి వివిధ రూట్లల్లో 500 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. దూర ప్రాంతాలకు బస్సులు నడుపుతుండగా గ్రామీణా ప్రాంతాలకు వెళ్లే బస్సులు తగ్గడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వగ్రామాలకు వెళ్లేవారి నుంచి స్పెషల్ పేరిట అదనంగా 50 శాతం పసూళ్లు చేస్తోందని, పండగపూట ఆర్టీసీ ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

News January 14, 2026

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 పోస్టులు

image

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హతగల వారి నుంచి జనవరి 15 నుంచి 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: bankofmaharashtra.bank.in