News February 18, 2025
పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలకు గ్రీన్ సిగ్నల్

జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను మార్చి 14వ తేదీన పిఠాపురంలో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. దీనికి ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపినట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పిఠాపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. కాగా ఎన్నికల్లో ఘన విజయం అనంతరం జనసేన నిర్వహిస్తున్న తొలి సభ కానుండటంతో కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది.
Similar News
News November 9, 2025
బై పోల్.. ప్రచారానికి నేడే ఆఖరు

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార పర్వం నేటితో ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు మైకులు, ప్రచార రథాలు మూగబోనున్నాయి. ప్రచార గడువు ముగియనుండటంతో ఆయా పార్టీల నేతలు తమ ప్రత్యర్థులపై పదునైన మాటల తూటాలు సంధిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ఇవాళ సా.6 నుంచి ఈ నెల 11(పోలింగ్ తేదీ) సా.6 గంటల వరకు నియోజకవర్గంలో వైన్స్ మూసివేయాలని HYD సీపీ సజ్జనార్ ఆదేశించారు.
News November 9, 2025
13 ఏళ్లుగా HYDలో వేములవాడ రాజన్న కళ్యాణం

ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం శనివారం HYDలోని ఎన్టీఆర్ గార్డెన్స్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా గత 13 సంవత్సరాలుగా ఏటా రాజరాజేశ్వర స్వామి, అమ్మవార్ల కళ్యాణాన్ని హైదరాబాదులో ఘనంగా జరిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి కళ్యాణం కనులపండువగా సాగింది. ఆలయ ఈవో, CM పాల్గొన్నారు.
News November 9, 2025
కరీంనగర్: జాతీయ స్థాయికి ఒగ్గుడోలు విద్యార్థులు

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కళా ఉత్సవ్- 2025లో రాష్ట్రస్థాయిలో విజయం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. పదో తరగతి చదువుతున్న రోహిత్, ఆశిష్, రిత్విక్, హర్షిత్ గ్రామీణ సాంప్రదాయ ఒగ్గుడోలు కళా ప్రదర్శనలో ప్రతిభ చాటారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.


