News February 18, 2025

ఉంగుటూరు: వివాహేతర సంబంధమే హత్యకు కారణం?

image

ఉంగుటూరు(M) బావాయిపాలెంలో <<15486017>>ఏసురాజు హత్యకు <<>>వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. ప్రియురాలు భర్త, మామలే ఏసు రాజుని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. తన భార్యతో చనువుగా ఉండొద్దని ఆమె భర్త చెప్పినా వినకపోవడం, మెసేజ్‌లు చేస్తున్నాడనే కోపంతో ఏసురాజుని బావాయిపాలెం తీసుకొచ్చి చేయి నరికేశారు. అనంతరం రక్తస్రావంతో ఏసు మృతి చెందాడు. కాగా మృతుడు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.

Similar News

News February 25, 2026

ప.గో: నిరుద్యోగ యువతకు GOOD NEWS

image

భీమవరంలోని శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న నిర్వహించనున్న మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో ఇందుకు సంబంధించిన గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ మేళాలో సుమారు 21 ప్రముఖ కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని, అర్హులైన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కలెక్టర్ సూచించారు.

News February 24, 2026

ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.