News February 18, 2025

ములుగు: ‘ఎస్సై వేధిస్తున్నాడు.. ఆత్మహత్యకు అనుమతించండి’

image

ములుగు జిల్లాకు చెందిన ఓ ఎస్సై, అతడి కుటుంబీకులు వేధింపులకు గురిచేస్తున్నారని, ఆత్మహత్యకు అనుమతించాలని మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన సంది సులోచన- ప్రతాప్ రెడ్డి దంపతులు భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు.దంపతులకు గ్రామంలో ఉన్న 12 ఎకరాల భూమికి చెందిన బండ్ల బాటను ఎస్సై, అతడి కుటుంబీకులు 2022 మే 15న దున్ని వారి భూమిలో కలుపుకొన్నారన్నారు. కేసులు పెట్టి ఇబ్బందికి గురిచేస్తున్నారన్నారు.

Similar News

News January 14, 2026

ఆస్టియోపోరోసిస్‌ ముప్పు వారికే ఎక్కువ

image

మెనోపాజ్‌దశలో ఆడవాళ్లలో ఆస్టియోపోరోసిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే సంతాన సంబంధిత సమస్యలు ఉన్నవారిలో ఈ రిస్క్‌ మరింత ఎక్కువని ఫెర్టిలిటీ అండ్‌ స్టెరిలిటీ జర్నల్‌లోని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గతంలో సంతాన లేమి, గర్భస్రావం, మృత శిశువు జన్మించటం వంటివి జరిగిన మహిళల్లో ఆస్టియోపోరోసిస్‌ ముప్పు 16శాతం అధికంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీరు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

News January 14, 2026

గుంటూరు: DLSAలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లా న్యాయసేవాధికార సంస్ధ(DLSA)లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DLSA కార్యదర్శి జియావుద్దీన్ తెలిపారు. ఒక రికార్డు అసిస్టెంట్, 1 డేటా ఎంట్రీ ఆపరేటర్, 1 ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టును ఓపెన్ కేటగిరీలో రెగ్యులర్ ప్రాతిపదికన నియమించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మరిన్ని వివరాలకు https://Guntur.dcourts.gov.inని సందర్శించాలని సూచించారు.

News January 14, 2026

సంక్రాంతి: నల్ల నువ్వులతో ఈ పరిహారాలు పాటిస్తే?

image

సంక్రాంతి నాడు నల్ల నువ్వుల దానం సిరిసంపదలను ప్రసాదిస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే పితృదేవతలు శాంతించి, వంశాభివృద్ధి కలుగుతుందని సూచిస్తున్నారు. ‘దీనివల్ల శని దోషాలు కూడా తొలగి ప్రశాంతత లభిస్తుంది. నువ్వులను ఆహారంగా తీసుకోవడం వల్ల చలికాలపు అనారోగ్యాల నుంచి రక్షణ లభిస్తుంది’ అని వివరిస్తున్నారు. మరిన్ని సంక్రాంతి విశేషాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.