News March 21, 2024

సంగారెడ్డి: ‘ధరణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి’

image

ధరణి పెండింగ్ దరఖాస్తులను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం ప్రకటనలో తెలిపారు. తహసిల్దార్ క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలించిన తర్వాత వెంటనే ఆర్డీవో, కలెక్టరేట్ పంపించాలని చెప్పారు. దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని దరఖాస్తులను పరిశీలించాలని సూచించారు.

Similar News

News October 22, 2025

MDK: గురుకులాల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తులు

image

గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకీ దరఖాస్తుల గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు ఇన్చార్జి డీసీవో పద్మావతి తెలిపారు. రామాయంపేట, కొల్చారం ఎస్సీ గురుకులాల్లో 2025-26 ఏడాదికి 5 నుంచి 9 తరగతులలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగలవారు ఈ అవకశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 25న డ్రా పద్ధతిలో ఎంపిక ఉంటుందన్నారు.

News October 22, 2025

మెదక్: సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి: కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రజలు ఈ సర్వేలో పాల్గొని సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25న ముగుస్తుందన్నారు.

News October 22, 2025

మెదక్: రాయితీపై విత్తనాలు పంపిణీ: కలెక్టర్

image

రేగోడ్ రైతు వేదికలో మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో రాయితీ పై ప్రొద్దు తిరుగుడు, శనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ మాట్లాడుతూ.. యాసంగి 2025-26 సీజన్‌కు గజ్వాడ గ్రామంలో 50 ఎకరాల్లో బ్లాక్ లెవెల్ డెమో చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ADA టెక్నికల్ జి.విన్సెంట్ వినయ్, ADA ఇన్‌ఛార్జ్ రాంప్రసాద్, MAO మొహమ్మద్ జావీద్, MRO దత్తు రెడ్డి పాల్గొన్నారు.