News February 18, 2025

వరంగల్: టూరిస్టుల కోసం స్పెషల్ బస్సు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు పర్యాటక ప్రదేశాల సందర్శన కోసం టూరిజం సంస్థ ప్రత్యేక ఏసీ బస్సును ఏర్పాటు చేసింది. ఈనెల 20న ఉదయం 7.45కు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి బస్సు ప్రారంభమవుతుంది. వేయి స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, రామప్ప, లక్నవరం, రాత్రి ఖిలా వరంగల్ సందర్శన అనంతరం రాత్రి 8 గంటలకు హన్మకొండకు చేరుకుంటుంది. పెద్దలకు రూ.980లు, పిల్లలకు రూ.790లుగా టికెట్ ధర నిర్ణయించారు.

Similar News

News November 8, 2025

జగిత్యాల: ‘వృద్ధుల హక్కుల పరిరక్షణకు కమిషన్ అవసరం’

image

సీనియర్ సిటిజెన్స్ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి కమిషన్ ఏర్పాటు చేయాలని టాస్కా రాష్ట్ర అధ్యక్షులు పి. నర్సింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో జరిగిన ప్రతినిధి మండలి సమావేశంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 46 మంది సీనియర్ సిటిజన్లను సన్మానించారు.

News November 8, 2025

దమ్మన్నపేట రచ్చబండ…గ్రామ చరిత్రకు ప్రతీక

image

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలోకి అడుగుపెట్టగానే కనిపించే పాత వేపచెట్టు కింద ఉన్న రచ్చబండ గ్రామానికి ప్రత్యేక గుర్తుగా నిలుస్తోంది. దాదాపు 2 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ “కచ్చిరి” వద్ద నిజాం రాజు కాలంలో స్వాతంత్ర్య సమరయోధులు దేశభక్తి చర్చలు జరిపేవారని పెద్దలు చెబుతున్నారు. ఇప్పటికీ పెద్దలు ఉదయం, సాయంత్రం కలిసి కూర్చుని గ్రామ విషయాలు మాట్లాడుకునే ఆత్మీయ స్థలంగా దీన్ని భావిస్తారు.

News November 8, 2025

రైల్వేలో 8,868 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

RRBలో 8,868 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు. గ్రాడ్యుయేట్ పోస్టులకు 18- 33ఏళ్లవారు ఈనెల 20 వరకు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 18- 30ఏళ్లున్న వారు ఈ నెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.