News February 18, 2025
తండ్రి మృతి.. స్వదేశానికి మోర్కెల్

టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తండ్రి మరణించారు. దీంతో ఆయన సౌతాఫ్రికాకు బయల్దేరివెళ్లారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత జట్టుతో కలిసి దుబాయ్ వెళ్లిన మోర్కెల్ అక్కడి నుంచే స్వదేశానికి వెళ్లిపోయారు. అటు టోర్నీలో భాగంగా ఇండియా ఎల్లుండి బంగ్లాదేశ్‌తో తలపడనుంది. మోర్కెల్ ఎప్పుడు తిరిగి వస్తారనేదానిపై బీసీసీఐ త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది.
Similar News
News March 14, 2025
చేప కొరికితే చేయి పోయింది!

ఒక్కోసారి చిన్నగాయాలు కూడా పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. కేరళలోని కన్నూర్‌కు చెందిన రాజేశ్ అనే రైతు గత నెల ఇంటి వద్ద చెరువును శుభ్రం చేస్తుండగా చేతి వేలిని ‘కడు’ జాతి చేప కొరికింది. చూస్తుండగానే అది ‘గ్యాస్ గాంగ్రీన్’ ఇన్ఫెక్షన్‌గా మారింది. దీంతో వైద్యులు అతడి కుడిచేతిని మోచేతి వరకు తీసేశారు. చేప నుంచి అతడి ఒంట్లో చేరిన క్లోస్ట్రిడియమ్ బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్ అయిందని వైద్యులు తెలిపారు.
News March 14, 2025
ఎలాన్ మస్క్ Starlinkకు కేంద్రం షరతులు!

ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోతో జట్టుకట్టిన స్టార్‌లింకుకు కేంద్రం కొన్ని షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. దేశంలో ప్రవేశించాలంటే కచ్చితంగా కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. శాంతిభద్రతల నియంత్రణకు ఇది కీలకం. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితి చేయిదాటినప్పుడు ఇంటర్నెట్‌ను నిలిపివేయాలంటే ప్రతిసారీ USలోని స్టార్‌లింక్ ఆఫీస్‌ను సంప్రదించడం కుదరదు. అందుకే షరతులు పెట్టింది.
News March 14, 2025
BREAKING: మసీదులో బాంబు బ్లాస్ట్

దాయాది పాకిస్థాన్ మరోసారి ఉలిక్కిపడింది. సౌత్ వజీరిస్థాన్‌లోని అజామ్ వర్సాక్‌లో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు జరుగుతుండగా ఓ మసీదులో బాంబు పేలింది. ఈ ఘటనలో JUI డిస్ట్రిక్ట్ చీఫ్ అబ్దుల్లా నదీమ్, మరొకరు గాయపడ్డారని సమాచారం. బాంబు పెట్టిందెవరు? ప్రాణ, ఆస్తి నష్టం గురించి తెలియాల్సి ఉంది. రంజాన్ మాసం రెండో శుక్రవారం కావడంతో ప్రజలు భారీగా మసీదుకు వచ్చారని సమాచారం.