News February 18, 2025
అరెస్టు నుంచి యూట్యూబర్ రణ్‌వీర్‌కు రిలీఫ్

యూట్యూబర్ <<15499212>>రణ్‌వీర్<<>> అలహాబాదియ మాటలతో మన తల్లులు, ఆడపడుచులు, సమాజం తలదించుకుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే అరెస్టుల నుంచి రక్షణ కల్పించింది. ఇది ప్రజా కోర్టు కాదని, పౌరులు బెదిరించేందుకు, దోషిగా తేల్చేందుకు వీల్లేదని తెలిపింది. స్థానిక పోలీసుల వద్ద రక్షణ పొందొచ్చని సూచించింది. విచారణకు పూర్తిగా సహకరించాలని, పాస్‌పోర్టును ఇవ్వాలని ఆదేశించింది. ఇదే కేసులో ఇంకెక్కడా FIR నమోదు చేయొద్దంది.
Similar News
News March 14, 2025
వలపు వలలో చిక్కి పాక్‌కు భారత రహస్యాలు.. వ్యక్తి అరెస్ట్

భారత రక్షణ రహస్యాల్ని పాక్ నిఘా సంస్థ ISIకి చేరవేస్తున్న రవీంద్ర అనే వ్యక్తిని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. UPలోని ఫిరోజాబాద్‌లో ఆర్డినెన్స్ పరిశ్రమలో అతడు పనిచేస్తున్నాడు. నేహా శర్మ పేరుతో ISI విసిరిన వలపు వలలో చిక్కుకుని కీలక సమాచారాన్ని వారికి చేరవేశాడని అధికారులు తెలిపారు. దానికి సంబంధించిన ఆధారాల్ని అతడి ఫోన్ నుంచి రికవర్ చేశామని, అతడి సహాయకుడినీ అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.
News March 14, 2025
చేప కొరికితే చేయి పోయింది!

ఒక్కోసారి చిన్నగాయాలు కూడా పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. కేరళలోని కన్నూర్‌కు చెందిన రాజేశ్ అనే రైతు గత నెల ఇంటి వద్ద చెరువును శుభ్రం చేస్తుండగా చేతి వేలిని ‘కడు’ జాతి చేప కొరికింది. చూస్తుండగానే అది ‘గ్యాస్ గాంగ్రీన్’ ఇన్ఫెక్షన్‌గా మారింది. దీంతో వైద్యులు అతడి కుడిచేతిని మోచేతి వరకు తీసేశారు. చేప నుంచి అతడి ఒంట్లో చేరిన క్లోస్ట్రిడియమ్ బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్ అయిందని వైద్యులు తెలిపారు.
News March 14, 2025
ఎలాన్ మస్క్ Starlinkకు కేంద్రం షరతులు!

ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోతో జట్టుకట్టిన స్టార్‌లింకుకు కేంద్రం కొన్ని షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. దేశంలో ప్రవేశించాలంటే కచ్చితంగా కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. శాంతిభద్రతల నియంత్రణకు ఇది కీలకం. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితి చేయిదాటినప్పుడు ఇంటర్నెట్‌ను నిలిపివేయాలంటే ప్రతిసారీ USలోని స్టార్‌లింక్ ఆఫీస్‌ను సంప్రదించడం కుదరదు. అందుకే షరతులు పెట్టింది.