News February 18, 2025
పల్నాడులో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి..

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ ధరలు దిగొస్తున్నాయి. కాగా పల్నాడు జిల్లాలో ధరలపై పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. చాలా ప్రాంతాల్లో రూ.50- రూ.100 మేర ధర పడిపోగా జిల్లాలో రూ.30 మేర మాత్రమే తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.230లు, స్కిన్‌తో రూ. 210లుగా ఉంది. గతవారం కేజీ రూ.260-280 వరకు ఉంది. మరోవైపు మటన్ ధర రూ.900 వద్ద నిలకడగా కొనసాగుతుంది. 100గుడ్లు రూ.420 వరకు అమ్ముతున్నారు.
Similar News
News September 15, 2025
ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపాలి: కలెక్టర్

సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. నేడు ఐడీవోసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నుంచి సమస్యల దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పరిష్కారంలో జాప్యం చేయొద్దని అధికారులకు తెలిపారు.
News September 15, 2025
రేపు భారీ వర్షాలు

ఏపీలోని కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా ఇవాళ తూ.గో., ప.గో., కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
News September 15, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి: కలెక్టర్

నిర్మల్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. అలాగే, జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు జరిగే ‘పోషణ్ మా’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రత్యేక పోషకాహార కార్యక్రమాలు నిర్వహించి, ‘ఎనీమియా ముక్త నిర్మల్’ లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు.