News February 18, 2025
వినుకొండ: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

వినుకొండలో విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని తారకరామ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా టైల్స్ పనులు నిమిత్తం నాలుగు నెలల క్రితం కార్మికులు వచ్చి పనులు నిర్వహిస్తున్నారు. సోమవారం టైల్స్ పని చేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి పవన్ కుమార్ అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News March 12, 2025
గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారు: KTR

రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం తీవ్రమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 30% మించి రైతు రుణమాఫీ జరగలేదని రుణమాఫీ అయిపోయిందని గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారన్నారు. అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.
News March 12, 2025
ఉద్యోగం కోసం నిరుద్యోగుల క్యూ!

ఓ వైపు 40+ డిగ్రీల ఎండ. ఎప్పుడు లోపలికి పిలుస్తారో తెలియదు. కానీ, ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో గంటల తరబడి లైన్‌లో వేచి ఉన్నారీ నిరుద్యోగులు. ఈ దృశ్యం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అమెజాన్ కంపెనీ వద్ద కనిపించింది. ఇంటర్వ్యూ కోసం ఇంతమంది రావడంతో నిరుద్యోగం ఎంతలా పెరిగిందో చూడాలంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీల వద్ద ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయని చెబుతున్నారు.
News March 12, 2025
కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రతి మూడో శనివారం చేపడుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలపై చర్చించారు. నిర్వహణపై బుధవారం ఉదయం తన ఛాంబర్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు.