News February 18, 2025
పెద్దపల్లి: సంస్థ భవిష్యత్తు ప్రతి ఒక్కరి బాధ్యత: CMD

సింగరేణి సంస్థ భవిష్యత్తు ప్రతి ఒక్కరి బాధ్యత అని, సక్రమంగా విధులు నిర్వహించాలని, అలసత్వం ప్రదర్శించే వారికి కంపెనీలో స్థానం ఉండదని సంస్థ CMD బలరాం స్పష్టం చేశారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల GMలు, 39 గనులకు సంబంధించిన ప్రాజెక్టు అధికారులు, ఏజెంట్లతో తొలిసారిగా HYD సింగరేణి భవన్ నుంచి ముఖాముఖి సమీక్ష నిర్వహించారు. ఆయా ఏరియాలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆయన ఆదేశించారు.
Similar News
News March 14, 2025
ట్రైన్ హైజాక్: పాక్ ఆరోపణల్ని తిప్పికొట్టిన భారత్

బలూచిస్థాన్ ట్రైన్ హైజాక్ ఘటనలో విదేశీ జోక్యంపై పాక్ ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది. ఉగ్రవాదానికి జన్మస్థానమేదో ప్రపంచం మొత్తానికీ తెలుసని పేర్కొంది. ‘పాక్ నిరాధార ఆరోపణలను మేం ఖండిస్తున్నాం. వారి అంతర్గత సమస్యలు, వైఫల్యాలకు ఇతరులను నిందించడం, వేలెత్తి చూపడం మానేసి అంతర్మథనం చేసుకోవాలి’ అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. BLAకు అఫ్గాన్ సాయం, భారత్‌పై వైఖరి మారలేదని పాక్ నిన్న ఆరోపించింది.
News March 14, 2025
ఒక్కరోజే రూ.1,200 పెరిగిన గోల్డ్ రేట్

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 పెరిగి రూ.82,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 పెరగడంతో రూ.89,780కు చేరింది. అటు వెండి ధర రూ.2,000 పెరగడంతో ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,12,000గా ఉంది.
News March 14, 2025
VIRAL: కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్ చూశారా?

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరో 8 రోజుల్లో ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుండగా, ఆయన నయా హెయిర్ స్టైల్ చేయించుకున్నారు. ఈ ఫొటోలను హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ ఖాన్ షేర్ చేస్తూ ‘GOAT ఎనర్జీ’ అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో 218 రన్స్ చేసిన కింగ్, ఈసారి తన బ్యాటింగ్‌తో ఆర్సీబీకి తొలి కప్ అందిస్తారేమో చూడాలి.