News February 18, 2025
KMR: పోలీసులకు డ్రైవింగ్ నైపుణ్యత చాలా ముఖ్యం: ఎస్పీ

అత్యవసర విభాగంలో పని చేసే పోలీసులకు డ్రైవింగ్ నైపుణ్యత చాలా ముఖ్యమని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. జిల్లా పోలీసు శాఖలో ఇటీవల 189 మంది నూతన పోలీస్ కానిస్టేబుళ్లు చేరారన్నారు. సివిల్ కానిస్టేబుళ్లు 115, ఆర్మ్డ్ రిజర్వు కానిస్టేబుళ్లు 74 మంది ఉన్నారన్నారు. వీరందరికీ అత్యవసర పరిస్థితుల్లో డ్రైవింగ్ రావాలనే ఉద్దేశంతో ఆరు వారాల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Similar News
News March 1, 2026
ఇవి ప్రభుత్వం ఇస్తున్న పక్కా ఇళ్లు!

ప్రకృతి విపత్తు వందలాది మందిని నిరాశ్రయులను చేస్తే కేరళ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి బాధితుల జీవితాల్లో కొత్త ఆశలను నింపింది. వయనాడ్ బాధితుల కోసం ప్రభుత్వం నిర్మించిన అద్భుతమైన టౌన్‌షిప్ ఇవాళ ప్రారంభంకానుంది. ముండక్కై-చూరల్మల కొండచరియలు కూలడంతో ఇళ్లు కోల్పోయిన 178 కుటుంబాలకు మొదటి దశలో అన్ని సౌకర్యాలతో కూడిన 51 నూతన గృహాలను సీఎం పినరయి అందజేశారు. ఒక్కో ఇంటిపై రూ.26లక్షలు ఖర్చు చేశారు.
News March 1, 2026
ప్రజావాణికి సకాలంలో హాజరు కావాలి: భద్రాద్రి కలెక్టర్

సోమవారం(రేపు) కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత శాఖాధికారులు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను వెంటనే స్వీకరించాలని అన్నారు.
News March 1, 2026
గోదావరిఖని నుంచి కన్యాకుమారికి RTC టూర్ ప్యాకేజీ

గోదావరిఖని నుంచి కన్యాకుమారి వరకు యాత్ర ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు DM నాగభూషణం తెలిపారు. యాత్రలో భాగంగా కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, ఫళని, పాతాళశెంబు (కరుంగళిమాల) మధురై, కంచి, రామేశ్వరం, కన్యాకుమారి, జోగులాంబ శక్తిపీఠం లాంటి పుణ్యక్షేత్రాల దర్శనాలు ఉంటాయని తెలిపారు. పెద్దలకు రూ.9999గా, పిల్లలకు రూ.6500గా నిర్ణయించామన్నారు. వివరాలకు, టికెట్ల రిజర్వేషన్ కోసం 7013504982 సంప్రదించాలన్నారు.


