News February 18, 2025
MNCL: 30వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్షలు

మంచిర్యాలలోని శాలివాహన పవర్ ప్లాంట్ ఎదుట కార్మికులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు నేటితో 30వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘం అధ్యక్షుడు కుంటాల శంకర్ మాట్లాడుతూ.. ప్లాంట్ మూసివేసి 26 నెలలు గడుస్తున్న కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించకుండా కంపెనీ యాజమాని, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.
Similar News
News April 4, 2026
రైనా 18ఏళ్ల రికార్డ్ బ్రేక్!

పంజాబ్‌తో పోరులో చెన్నై ఓడినా ఆ జట్టు యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే ప్రదర్శనపై ప్రశంసలు కురుస్తున్నాయి. 43బంతుల్లో 73రన్స్ చేసి జట్టుకు మంచి స్కోర్ అందించిన మాత్రే చెపాక్‌లో రైనా రికార్డ్ బ్రేక్ చేశారు. 18ఏళ్ల 261రోజుల వయసు ఉన్న మాత్రే చెన్నై హోంగ్రౌండ్‌లో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచారు. అంతకుముందు 2008లో రైనా(21ఏళ్ల 148రోజులు) MIపై హాఫ్ సెంచరీ కొట్టారు.
News April 4, 2026
తిరుపతి: రైలులో గుండెపోటు.. ప్రాణం కాపాడిన చదువు..!

సూళ్లూరుపేటలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఉపేంద్ర(55)కు గుండెపోటు వచ్చిన సమయంలో రాజా అనే యువకుడు సమయస్ఫూర్తితో స్పందించాడు. స్టాఫ్‌నర్స్ కోర్సు పూర్తి చేసిన రాజా ప్రథమ చికిత్స అందించి బాధితుడి ప్రాణాలను కాపాడాడు. రైలు స్టేషన్‌కు చేరగానే బాధితుడిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజా చేసిన సేవను వైద్యులు, స్థానికులు అభినందిస్తూ నిజమైన హీరో రాజా అని కొనియాడారు.
News April 4, 2026
పెళ్లి ప్యాకేజీల్లో వెయిట్ లాస్ ఇంజెక్షన్లు!

పెళ్లికి సిద్ధపడే వధూవరులకు వెల్‌నెస్ క్లినిక్‌లు హెయిర్-స్కిన్ కేర్ ప్యాకేజ్‌లు ఆఫర్ చేయడం కామన్. కానీ ఇప్పుడు ఆ జాబితాలో వెయిట్ లాస్ ఇంజెక్షన్లూ చేరాయి. ఢిల్లీలోని ఓ క్లినిక్ ‘మాంజురో బ్రైడ్’ పేరుతో ప్యాకేజ్ ఆఫర్ చేయడం చర్చనీయాంశమైంది. దేశంలోని అనేక క్లినిక్స్ ఇలాంటి ప్యాకేజ్‌లు ఇస్తున్నాయి. పెళ్లికి త్వరగా బరువు తగ్గాలనుకునే జంటల సంఖ్య పెరగడంతో ఈ ట్రెండ్ పుట్టుకొచ్చిందని నిపుణులు చెబుతున్నారు.


