News February 18, 2025
రుయ్యాడిలో కత్తిపోట్ల కలకలం.. ఒకరి మృతి

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. మండలంలోని రుయ్యాడి గ్రామంలో ఓ వ్యక్తి మంగళవారం కత్తిపోటుకు గురయ్యారు. గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గొడవలో మహేందర్ అనే వ్యక్తిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.
Similar News
News December 13, 2025
15న టెక్కలిలో ప్రజా వేదిక: కలెక్టర్

ఈనెల 15న టెక్కలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం తెలిపారు. టెక్కలి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని నూతన సమావేశ మందిరంలో నిర్వహిస్తారని చెప్పారు. ఈ వేదికలో ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 13, 2025
పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ రోహిత్ రాజు

పంచాయతీ ఎన్నికల సందర్భంగా భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు బుధవారం ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో సబ్ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, పంచాయతీల వారీగా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
News December 13, 2025
మోగ్లీ మూవీ రివ్యూ&రేటింగ్

ప్రేమించిన యువతి కోసం క్రిమినల్ పోలీస్‌తో హీరో చేసే పోరాటమే మూవీ కథ. రోషన్ యాక్టింగ్, బధిర యువతిగా హీరోయిన్, బండి సరోజ్ నటన మెప్పిస్తాయి. వైవా హర్ష కామెడీ నవ్వులు పూయిస్తుంది. మ్యూజిక్ ఫర్వాలేదు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లవ్‌స్టోరీ రొటీన్‌గా అనిపిస్తుంది. సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించవు. ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవుతుంది. కర్మ సిద్ధాంతంతో లింక్ పెట్టి సందీప్ రాజ్ కథ అల్లారు.
రేటింగ్:2.25/5


