News February 18, 2025

పరిగిలో సినిమా షూటింగ్ సందడి  

image

యంగ్ హీరో సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘మజాకా’, తాజాగా ఈ మూవీలోని ‘ఓ చిన్నా రాములమ్మా’ సాంగ్ లైవ్ షూటింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ షూట్ పరిగి మున్సిపల్ పరిధిలోని నజీరా బాద్ తండా సమీపంలోని గుట్టపై సన్నివేశాలను చిత్రీకరించారు. త్రినాథరావు నక్కి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రాజేష్ దండ, ఉమేష్ KR బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈనెల 26న రిలీజ్ కానుంది. 

Similar News

News January 7, 2026

NZB: పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ బదిలీ

image

పౌరసరఫరాల సంస్థ నిజామాబాద్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం DSOగా బదిలీ అయ్యారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డికి జిల్లా మేనేజర్‌‌గా బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా శ్రీకాంత్ రెడ్డి బదిలీ కావడంతో కార్యాలయ సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

News January 7, 2026

టీటీడీ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం

image

టీటీడీ పరిధిలోని రెండు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం నేటి నుంచి ప్రారంభం కానుంది. టీటీడీ విద్యా కమిటీ సూచన మేరకు బోర్డు తీసుకున్న నిర్ణయంను బుధవారం నుంచి అమలు చేయనున్నారు. ప్రభుత్వం జూనియర్ కళాశాలలో తరహా టీటీడీ జూనియర్ కళాశాలలో విద్యార్ధులందరికి మధ్యాహ్న భోజనం అందించనున్నారు.

News January 7, 2026

నిర్మల్ బల్దియా పోరు.. అభివృద్ధిపైనే పార్టీల గురి

image

నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల వేళ నిర్మల్‌లో రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి. పట్టణాభివృద్ధే ప్రధాన అజెండాగా పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. రోడ్ల విస్తరణ, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా వంటి పౌర సమస్యలపైనే అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలను పరిష్కరిస్తామని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు.