News February 18, 2025
NTR: గురుకులాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

మైలవరం, జగ్గయ్యపేటలోని జ్యోతిబాఫులే బీసీ బాలుర గురుకుల పాఠశాలల్లో వచ్చే ఏడాదిలో 5వ తరగతిలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ప్రవేశపరీక్ష నిర్వహించి మైలవరంలో 80, జగ్గయ్యపేటలో 40 సీట్లు భర్తీ చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్చి 15 లోపు https://mjpapbcwreis.apcfss.in/ వెబ్‌సైట్‌లో చూడాలని అధికారులు సూచించారు.
Similar News
News December 25, 2025
ఇంజినీరింగ్ ఫీజుల్లో మార్పులు.. జీవో జారీ

AP: హైకోర్టు తుది తీర్పుకు అనుగుణంగా ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు చేస్తూ ఉన్నత విద్యాశాఖ జీవో విడుదల చేసింది. దీని ప్రకారం కనిష్ఠంగా రూ.40వేల నుంచి గరిష్ఠంగా రూ.1.05 లక్షల వరకు ఫీజు ఉండనుంది. 7 కాలేజీలకు మాత్రమే స్వల్పంగా ఫీజులు పెరిగాయి. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం కింద అడ్మిషన్లు పొందిన వారికి 2024-25 నుంచి మూడేళ్ల కాలానికి ఇవే ఫీజులు అమలవుతాయి. కాగా గతంలో కనీస ఫీజు రూ.43వేలుగా ఉండేది.
News December 25, 2025
ఎస్పీ నరసింహ క్రిస్మస్ విషెస్

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఎస్పీ నరసింహ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మదినం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పండుగ ప్రజలందరిలో శాంతి, ఆనందం, సౌభాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటూ, జిల్లా పోలీస్ శాఖ తరపున ప్రజలందరూ సుఖ సంతోషాలతో వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ సందేశాన్ని ఇచ్చారు.
News December 25, 2025
TPT: కుక్కపిల్లను కాపాడబోయి యువకుడి మృతి

ఈ విషాద ఘటన తిరుపతి జిల్లా భాకరాపేట సమీపంలోని నెల్లిట్లవారిపల్లి పంచాయతీ రెడ్డి చెరువులో బుధవారం జరిగింది. చిన్నగొట్టిగల్లు ఇందిరానగర్‌కు చెందిన సంతోష్ కుమార్(40) భార్య, కుమార్తెతో బట్టలు ఉతకడానికి వెళ్లారు. తనతో తీసుకెళ్లిన కుక్కపిల్ల నీటిలో మునిగిపోయింది. దానిని కాపాడుతుండగా సంతోశ్ కుమార్ నీటిలో మునిగి చనిపోయాడు. సంతోశ్ కుమార్ మృతదేహాన్ని పీలేరు ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ రాజా కేసు నమోదు చేశారు.


