News February 18, 2025
KCR త్యాగాలు చేసింది నిజమే.. కానీ: గుత్తా

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘కేసీఆర్ త్యాగాలు చేసింది నిజమే.. తెలంగాణ ఉద్యమం నడిపింది వాస్తవమే.. కానీ కేసీఆర్ నాలుగు కోట్ల ప్రజల హీరో అయితే.. ఆ ప్రజలే ఎందుకు ఓడించారు. పదేపదే ప్రభుత్వం పడిపోతుంది అంటే అది అధికారం కోల్పోయిన బాధతో బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ప్రజలు అంటున్నారు’ అని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
Similar News
News February 21, 2025
ఎమ్మెల్సీ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ త్రిపాఠి

వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్, వరంగల్ -ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి రాష్ట్ర ప్రధానఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి తెలియజేశారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
News February 21, 2025
చింతపల్లి: పెళ్లింట తీవ్ర విషాదం

మనవరాలి పెళ్లికి పందిరి వేసేందుకు చెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా చెట్టు పైనుంచి జారిపడి వృద్ధుడు మృతి చెందిన ఘటన చింతపల్లి మం.లో జరిగింది. ధైర్యపురితండాకు చెందిన బాలయ్య(65) మనవరాలి వివాహం శుక్రవారం జరగనుండగా.. పందిరి వేసేందుకు గురువారం తమ పొలానికి సమీపంలో చెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా జారి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి.
News February 21, 2025
తిప్పర్తి: కరెంట్ షాక్‌తో చెట్టు మీదే వ్యక్తి మృతి

కరెంట్ షాక్‌తో మేకల కాపరి మృతి చెందిన ఘటన తిప్పర్తి మండలంలోని మర్రిగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాషా(48) మేకల కాపరిగా జీవనం కొనసాగిస్తున్నాడు. వాటి మేత కోసం తుమ్మచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి చెట్టు మీదనే మృతి చెందాడు.