News February 18, 2025
కరీంనగర్: మార్చి 6 నుంచి ‘పల్లె బాట’: జక్కని

బీసీల పోరాటాన్ని తెలంగాణలోని పల్లెల్లో విస్తృత పరుస్తామని, దాని కోసం కార్యాచరణలు ముందుకు సాగుతున్నామని బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీల జాగృతి కోసం మార్చి 6 నుంచి గ్రామ గ్రామాన పల్లెబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పల్లెబాటని విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News February 24, 2026
HYD: పర్యావరణం పేరుతో పాతాళానికి చెత్త!

జవహర్‌నగర్, దుండిగల్‌లో గుట్టుచప్పుడు కాకుండా 25 శాతం మిగులు వ్యర్థాలను అటవీ ప్రాంతాలకు తరలించేందుకు తెరవెనక పావులు కదులుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. వేస్ట్-టు-ఎనర్జీ తర్వాత మిగిలే ప్రమాదకర బూడిదను ఎకో-పార్కుల ముసుగులో భూమిలో పాతిపెట్టేందుకు క్లియరెన్సుల వేట సాగుతోంది. పర్యావరణ అనుమతులు రావడం కష్టమే అయినా, పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు.
News February 24, 2026
నారాయణపేట: సీఎం కప్ రెజ్లింగ్‌లో పతకాల పంట!

సీఎం కప్ 2వ ఎడిషన్ (2026) రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో నారాయణపేట జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారు. మొత్తం 4 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్య పతకాలు సాధించి జిల్లా సత్తా చాటారు. ప్రియమణి, బాలమణి, గీత, నాగలక్ష్మి బంగారు పతకాలు గెలుచుకోగా, నికిత రజతం సాధించింది. విజేతలను కోచ్ శ్రీనివాస్, అసోసియేషన్ కార్యదర్శి రవికుమార్ అభినందించారు.
News February 24, 2026
MNCL: నేరాల నియంత్రణకు ప్రణాళికాబద్ధమైన చర్యలు

సాంకేతిక ఆధారాలతో నేరాల నియంత్రణకు ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంగళవారం నిర్వహించిన జనవరి నెల నేర సమీక్షలో మాట్లాడారు. దర్యాప్తు నాణ్యతను మెరుగుపరిచి కేసుల పరిష్కార శాతాన్ని పెంచాలన్నారు. దీర్ఘకాల పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి కేసును పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించాలని ఆదేశించారు.


