News February 18, 2025
ADB: కత్తిపోట్ల ఘటన.. UPDATE

తలమడుగు మండలం రుయ్యాడిలో ఓ వ్యక్తి <<15500882>>దారుణ హత్య<<>>కు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలో బావబామ్మర్దుల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో బావ మహేందర్‌పై బామ్మర్ది అశోక్ కత్తితో దాడి చేశాడు. దీంతో మహేందర్ అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ కలహాలు నేపథ్యంలో హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు.
Similar News
News September 18, 2025
మంచిర్యాల జిల్లాలో 12.8 మి.మీ. వర్షపాతం నమోదు

మంచిర్యాల జిల్లాలో గడిచిన 24 గంటల్లో 12.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. అత్యధికంగా కాసిపేట మండలంలో 64.2 మి.మీ నమోదైంది. జన్నారం 0.4, దండేపల్లి 2.2, లక్షెట్టిపేట3.0, హాజీపూర్ 6.4,తాండూర్ 34.6, భీమిని 2.8, కన్నేపల్లి1.4, వేమనపల్లి 0.0, నెన్నల 1.0, బెల్లంపల్లి 32.0, మందమర్రి 17.2, మంచిర్యాల 29.4, నస్పూర్ 15.4, జైపూర్ 1.6, భీమారం 20.4, చెన్నూర్ 00, కోటపల్లి 00 మి.మీ. వర్షం కురిసింది.
News September 18, 2025
ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ బదిలీ

ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఆయన్ను ములుగు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీపీవోగా) నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ములుగు హెడ్ క్వార్టర్‌కు బదిలీ అయ్యారు. కాగా ప్రస్తుతం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఏటూరునాగారం సబ్ డివిజనల్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు బదిలీపై ఆయన ములుగు వెళ్లనున్నారు.
News September 18, 2025
రేపు మంచిర్యాలలో జిల్లా స్థాయి బోధనాభ్యసన సామగ్రి మేళా

మంచిర్యాలలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా స్థాయి బోధనాభ్యసన సామగ్రి మేళా నిర్వహించనున్నట్లు డీఈఓ యాదయ్య ఈరోజు తెలిపారు. జిల్లాలోని 18 మండలాల నుంచి మండల స్థాయి టీఎల్ఎం మేళాలో ఎంపికైన 172 మంది ఉపాధ్యాయులు తమ ఎగ్జిబిట్స్‌తో హాజరు కానున్నారని పేర్కొన్నారు. బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థులకు సులభంగా అర్థం కావడానికి ఈ మేళా ఎంతో దోహదపడుతుందన్నారు.