News February 18, 2025
రాష్ట్ర స్థాయి పోటీల్లో జగిత్యాల బిడ్డల ప్రతిభ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో జగిత్యాల నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు పట్టణానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్, కరాటే మాస్టర్ వెంకటేశ్వర్లు నేతృత్వంలో వెళ్లిన ఆరుగురు విద్యార్థులు 12 బంగారు పతకాలతో మెరిశారు. పట్టణంలోని వీర కుంగ్ ఫూ అకాడమీలో శిక్షణ పొందిన ఆరుగురు విద్యార్థులు మానూప్, కనిక్, మన్విత, మణిదీప్, అన్వితలు పాల్గొని 12 బంగారు పతకాలు సాధించారు.
Similar News
News March 15, 2025
దామరచర్ల: గ్రూప్-2, 3లో సత్తాచాటిన శశి కుమార్

దామరచర్ల మండలం తాళ్ల వీరప్ప గూడెం గ్రామానికి చెందిన రాయికింది శశి కుమార్ ఇటీవలే వెలువడిన గ్రూప్-3 ఫలితాలలో 19 రాంక్, గ్రూప్-2లో 12 ర్యాంక్ సాధించాడు. శశి కుమార్ తండ్రి రామ్మూర్తి మిర్యాలగూడ ట్రాన్స్ కో లైన్మెన్‌గా పని చేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహకంతోనే ర్యాంకు సాధించానని శశికుమార్ తెలిపారు. శశికుమార్‌ను పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
News March 15, 2025
NLG: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్

సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పదో తరగతికి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30న సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
News March 15, 2025
ఆదిలాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో AI బోధన

ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రైమరీ పాఠశాలల్లో శనివారం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) బోధన ప్రారంభించనున్నట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. తలమడుగు మండలం దేవాపూర్ ప్రైమరీ స్కూల్ తెలుగు, ఉర్దూ మీడియం, కోడద్ ప్రైమరీ స్కూల్, ఆదిలాబాద్ అర్బనులోని తాటిగూడ ప్రైమరీ పాఠశాలల్లో ఈ AI ప్రోగ్రాం ఉండనుందని వెల్లడించారు.