News February 18, 2025

రాజమండ్రి: ESI ఆసుపత్రిలో సిబ్బంది సస్పెన్షన్

image

రాజమహేంద్రవరంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు డాక్టర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సస్పెన్షన్ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం ఆసుపత్రిలో ఆకస్మీకంగా తనిఖీలు చేపట్టారు. విధుల నిర్వహణలో బాధ్యతరహిత్యంగా వ్యవహరించడంపై మంత్రి సీరియస్ అయ్యారు. విచారణ అనంతరం ఐదుగురి డాక్టర్లను, నలుగురి సిబ్బందిని సస్పెండ్ చేశారు.

Similar News

News February 21, 2025

RJY: మహాశివరాత్రి వేడుకలపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

image

భక్తులకు అత్యంత భక్తి ప్రాధాన్యమైన మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. శైవ క్షేత్రాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు.

News February 21, 2025

తాళ్లపూడి : ప్రేమించలేదని యువతిపై దాడి

image

సీనియర్ ఇంటర్ చదువుతున్న యువతిపై ప్రేమించడంలేదని దిలీప్ కుమార్ (19) దాడి చేసిన ఘటన తాళ్లపూడిలో జరిగింది. చదువు ఆపేసి జులాయిగా తిరిగే దిలీప్ కొంత కాలంగా యువతిని వేధించేవాడు. బుధవారం ఆమె కళాశాల వద్దకు వెళ్లి ప్రేమించకుంటే తన జీవితం నాశనం చేస్తానని బెదిరించి , దాడి చేశాడు. బాలిక తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.యువకుడిని గురువారం కోర్టుకు తరలించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

News February 21, 2025

నల్లజర్ల: గుండెపోటుతో పాస్టర్ మృతి

image

నల్లజర్ల మండలం, చీపురుగూడెం గ్రామానికి చెందిన పాస్టర్ గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. చీపురుగూడెం గ్రామ నివాసి పాస్టర్ వెంకటేశ్వరరావు గుండెపోటుతో అకస్మాత్తుగా పడిపోవడంతో 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. అంబులెన్సు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఆయ‌న మృతి చెందినట్లు నల్లజర్ల 108 సిబ్బంది నిర్ధారించారు. 

error: Content is protected !!