News February 18, 2025
నెల్లూరు కలెక్టర్‌ను ప్రశ్నిస్తూ కాకాణి లేఖ

నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయ ధోరణితో రాజకీయాలతో సత్సంబంధాలు ఉన్నాయంటూ.. నిబంధనలకు విరుద్ధంగా 5 మంది సభ్యుల సభ్యత్వాన్ని కలెక్టర్ రద్దు చేయడంపై లేఖాస్త్రం సంధించారు. ఇప్పుడున్న కమిటీని రద్దుచేసి నిబంధన ప్రకారం కమిటీని ఎన్నుకోవాలన్నారు. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు.
Similar News
News January 5, 2026
నెల్లూరులో ‘స్పై’ హీరో సందడి

హీరో నిఖిల్ నెల్లూరులో సందడి చేశారు. మాగుంట లేఔట్‌లోని ఓ షాపింగ్ మాల్‌ను ఆయన ప్రారంభించారు. నెల్లూరులోని చేపల పులుసు అంటే తనకు ఇష్టం అన్నారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
News January 5, 2026
నా విజయానికి కారణం చదువే : మంత్రి నారాయణ

మెరుగైన విద్య అందితేనే సమాజంలో గౌరవం, మంచి భవిష్యత్తు ఉంటాయని రాష్ట్ర మంత్రి పి. నారాయణ అన్నారు. నెల్లూరు కాపు భవన్‌లో బలిజ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ మంత్రి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు చదువే ఈ స్థాయిని ఇచ్చిందని వెల్లడించారు.