News February 18, 2025
రాయలసీమ యూనివర్సిటీ వీసీగా వెంకట బసవరావు

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా ప్రొఫెసర్ డాక్టర్ వెంకట బసవరావు నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటీఫికేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన త్వరలోనే వీసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. కాగా వెంకట బసవరావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా, పలు విభాగాలకు HODగా విధులు నిర్వహించారు.
Similar News
News February 21, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ కర్నూలులో తొలి జీబీఎస్ కేసు నమోదు. ➤ ఎమ్మిగనూరులో మహిళా దొంగల హల్ చల్. ➤ ఈ నెల 23న గ్రూప్-2 పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ. ➤ తుగ్గలి వద్ద బస్సు బోల్తా. ➤ పెద్దకడబూరు: నకిలీ ఇల్లు పట్టాలు.. వ్యక్తిపై కేసు. ➤ జగన్‌కు Z+ భద్రత కల్పించాలని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్. ➤ గ్రూప్-2 అభ్యర్థుల కోసం 08518-277305 హెల్ప్ డెస్క్ నంబర్. ➤ ఏపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడిగా చల్లా వరుణ్.
News February 21, 2025
గ్రూప్-2 అభ్యర్థుల అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్

గ్రూప్-2 అభ్యర్థుల సౌలభ్యం కోసం కర్నూలు కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం కర్నూల్ కలెక్టరేట్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు టోల్ ఫ్రీ 08518-277305 నంబరుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.
News February 21, 2025
కర్నూలులో జీబీఎస్ కేసు.. వ్యాధి లక్షణాలు ఇవే!

☞ కాళ్లు, చేతులలో మంట, <<15529133>>తిమ్మిర్లుగా<<>> అనిపించడం
☞ నరాల బలహీనత, కండరాల నొప్పులు
☞ సరిగ్గా నడవలేకపోవడం, తూలడం వంటి లక్షణాలు
☞ నోరు వంకర పోయి మింగలేక ఇబ్బంది పడే పరిస్థతి
☞ చెమటలు ఎక్కువగా పట్టడం
☞ వ్యాధి తీవ్రత ఎక్కువైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు